TG TET June 2026 Results | హైదరాబాద్: తెలంగాణలో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026 Results) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ సోమవారం (జులై 13న) మధ్యాహ్నం ఈ ఫలితాలను వెల్లడించారు. ఈ ఏడాది జూన్ సెషన్‌లో నిర్వహించిన టీజీ టెట్ పరీక్షల్లో మొత్తం 43.94 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ప్రకటించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను, స్కోర్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. తెలంగాణ టెట్ ఫలితాలు, ర్యాంక్ కార్డ్స్ డౌన్‌లోడ్ చేయండి https://tgtet.aptonline.in/UI/IntermedaiteScreens/TET_Results_Screens.aspx

తెలంగాణ టెట్ ఉత్తీర్ణత శాతం వివరాలు
ఈ ఏడాది జూన్‌ 16 నుంచి జూన్ 22వ తేదీ వరకు మొత్తం 10 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (CBT) టెట్‌ను నిర్వహించారు. ఈ జూన్‌ సెషన్‌ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 74.81 శాతం అంటే 1,15,028 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ టెట్ ఎగ్జామ్ 2026కు హాజరైన వారిలో 23,623 మంది ఇన్‌సర్వీస్‌ (ప్రస్తుతం విధుల్లో ఉన్న) ఉపాధ్యాయులు కూడా పరీక్ష రాయగా, వారిలో కేవలం 37.29 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ టెట్ ఫలితాలు, ర్యాంక్ కార్డ్స్ డౌన్‌లోడ్ చేయండి

https://tgtet.aptonline.in/UI/IntermedaiteScreens/Print_TGTET_June_Marks_Memo.aspx