Siddu Jonnalagadda's Telusu Kada Trailer Released: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'తెలుసు కదా' ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకుంటుండగా ట్రైలర్‌లో సరికొత్త టిల్లు భాయ్‌ను చూపించారు.

ట్రైలర్ ఎలా ఉందంటే?

సిద్ధు జొన్నలగడ్డలో ఇప్పటివరకూ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌లో కామెడీ యాంగిల్ చూసిన ఫ్యాన్స్... ఓ యాంగ్రీ యాంగిల్‌ను ట్రైలర్‌లో చూడొచ్చు. 'నువ్వు ఏ రోజైతే నీ ఆడదానికెళ్లి నీ కన్నీళ్లు, బాధ చూపిస్తావో ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి వాళ్ల చేతిలో పెట్టినవాడివి అవుతావ్. ఆ కంట్రోల్ ఎప్పుడూ వాళ్లకు ఇవ్వొద్దు. పవర్ సెంటర్ ఎప్పుడూ ఇక్కడే ఉండాలి.' అంటూ సిద్ధూ చెప్పే ఎమోషనల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది.

'ఎవర్ని ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి? అనేది మన కంట్రోల్‌లో ఉండాలి.' 'చేసుకుంటే లైఫ్ బాగుంటుందని గ్యారంటీలు, వారంటీలు ఇవ్వడానికి నేను సేల్స్ మ్యాన్ కాదు' అంటూ సిద్ధూ చెప్పే డైలాగ్స్ యూత్‌ను అట్రాక్ట్ చేస్తాయి. ట్రైలర్ కొన్ని ముద్దు సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు హీట్ పెంచేస్తున్నాయి. ట్రైలర్ చివర్లో కమెడియన్ వైవా హర్ష, సిద్ధు మధ్య ఓ డైలాగ్ ఇబ్బంది పెడుతుంది.

Also Read: 'OG' బ్యూటీ 'మేడ్ ఇన్ కొరియా' To సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బు' వరకూ... - నేరుగా ఓటీటీలోకి రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఇదే

అర్జున్ రెడ్డి, టిల్లు భాయ్ మిక్స్

రౌడీ బాయ్ అర్జున్ రెడ్డిని, డీజే టిల్లును కలిపి మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా హీరో సిద్ధు క్యారెక్టర్ ఉన్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తుండగా... హీరో ఇద్దరితో నడిపిన ప్రేమాయణం, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి తెలియాలంటే అక్టోబర్ 17 వరకూ ఆగాల్సిందే.