Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

3 months ago 6
ARTICLE AD

సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. ఓ సినిమా తర్వాత మరో సినిమా... మొత్తం అర డజను సినిమాలు థియేటర్లలోకి రావడానికి రెడీ అయ్యాయి. ప్రతిదీ భారీ బడ్జెట్ సినిమా కింద లెక్క. హీరోల మార్కెట్ పక్కన పెట్టి మరీ భారీగా ఖర్చు చేశారు. ప్రతి సినిమాకూ క్రేజ్ నెలకొంది. అందుకని, ఆయా సినిమాలను భారీ రేట్లకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు వాళ్ళు టికెట్ రేట్స్ పెంచితే బావుంటుందని కోరుకుంటున్నారు. ఏపీలో టికెట్ రేట్స్ పెంచడానికి ఎటువంటి సమస్య లేదు. కానీ తెలంగాణలో మాత్రం కొన్ని ఇష్యూలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చర్చలు మొదలు అయ్యాయి.

టికెట్ రేట్లు పెంచడానికి కోమటిరెడ్డి విముఖత!
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు అయిన కొత్తల్లో టికెట్ రేట్స్ విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురు కాలేదు. కానీ 'పుష్ప 2' ప్రీమియర్స్ సమయంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడంతో, తదనంతర పరిణామాలు తీవ్రమైన చర్చకు దారి తీశాయి. ఆ తర్వాత సైతం కొన్ని సినిమాలకు టికెట్ రేట్లు పెంచాయి. అయితే 'ఓజీ', 'అఖండ 2'కు పెంచడం వల్ల ఓ న్యాయవాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచడంపై కొన్నాళ్లుగా వివిధ రకాల సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా టికెట్ రేట్లు పెంచడానికి ఇప్పుడు 'నో' అంటున్నారట. ఆయన విముఖత వ్యక్తం చేస్తున్నారట. ఈ తరుణంలో ముఖ్యమంత్రి దగ్గరకు 'దిల్' రాజు వెళ్లారని తెలిసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు పంచాయతీ!
ఇప్పుడు సినిమా టికెట్ రేట్స్ హైక్ ఇష్యూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాంబర్ దగ్గరకు వెళ్ళింది. తెలంగాణలో, ఆ మాటకు వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్లలో 'దిల్' రాజు ఒకరు. ఆయన తెలంగాణ ఫిల్మ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ (Telangana FDC Chairman) కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకని, ఆయన దగ్గరకు 'దిల్' రాజు వెళ్లినట్టు తెలిసింది.

Also Read: Deepshikha Chandran: ఎవరీ దీప్శిఖా చంద్రన్? కన్నడ 'మార్క్'తో సెన్సేషన్... నెక్స్ట్ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ

సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్లు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని 'దిల్' రాజు రిక్వెస్ట్ చేశారట. అందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఈ అంశం మీద మాట్లాడనున్నట్టు సమాచారం. ఆ చర్చలు పూర్తి అయితే ఇవాళో రేపో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అప్పుడు ఓ సినిమా తర్వాత మరొక సినిమాకు టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ చేసే అవకాశం ఉంది. అదీ సంగతి!

ప్రభాస్ 'రాజా సాబ్', తమిళ హీరో విజయ్ 'జన నాయకుడు', చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు', రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.

Also Read: ఎవరీ శివాజీ? టీవీ నుంచి సినిమాల్లోకి & రీ ఎంట్రీ... వివాదాలు కాదు, ఆయన విజయాలు తెల్సా?

Read Entire Article