Telangana Rising Global Summit: తెలంగాణాన్ని ప్రపంచస్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం తలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌-2.0’ సన్నాహక పనులు వేగవంతమయ్యాయి. ‘మీ పెట్టుబడులకు మాది భరోసా’ అనే నినాదంతో, ‘ప్లెడ్జ్‌ టు ప్లాట్‌ టు ప్లాంట్‌ టు పే రోల్‌ టు ప్రొడక్ట్‌’ థీమ్‌తో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు ఫ్యూచర్‌ సిటీలోని ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’ ప్రాంగణంలో నాలుగు హాళ్లలో ఈ ఈవెంట్ జరగనుంది.

Also Read: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు

ఏర్పాట్లు

ఈ సమావేశానికి దాదాపు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ చేపట్టారు. బహిరంగ ప్రాంగణ పనులను నవంబరు 15లోగా, ఇండోర్ ఏర్పాట్లను నవంబరు 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పది రంగాలకు చెందిన 25 ప్రముఖ కంపెనీలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం హైదరాబాద్‌లో 1,000 హోటల్ గదులను కేటాయించారు.

గత సమిట్‌లో కుదిరిన 75 అవగాహన ఒప్పందాల్లో ఇప్పటివరకు 22 అమల్లోకి వచ్చాయి. 19 ఒప్పందాలు భూముల కేటాయింపు దశలో ఉండగా, మిగిలినవి వివిధ పరిశీలనల్లో ఉన్నాయి.

గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, మెటా, అమెజాన్, టెస్లా, ఫైజర్, అదానీ, ఐటీసీ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను సమిట్‌కు ఆహ్వానిస్తున్నారు. 275 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యేందుకు ఇప్పటికే అంగీకరించారు.

ఆస్ట్రేలియా, దుబాయ్, అమెరికాతో పాటు దేశంలో చెన్నై(అక్టోబరు 14), బెంగళూరు (అక్టోబరు 15), ముంబయి (నవంబరు 3), అహ్మదాబాద్ (నవంబరు 4) నగరాల్లో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. అక్టోబరు 26-29 మధ్య దిల్లీలో సమిట్ కర్టెన్‌రైజర్ జరగనుంది.

సదస్సులో తెలంగాణ జానపద కళలు, శాస్త్రీయ నృత్యాలు, హస్తకళలు, బతుకమ్మ ఉత్సవాలు, స్థానిక వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఈ సమ్మిట్‌కు అవసరమైన అనుమతుల ప్రక్రియలో సహకరించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు లేఖ రాశారు.

Also Read: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?