Telangana Voter list revised : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల సవరణకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఈ కార్యాచరణ నవంబర్ 20 నుంచి 23 వరకు నాలుగు రోజుల పాటు జరిగేలా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈలోపుల ఓటర్ల జాబితాల్లో లోపాలను సరిచేసి, కొత్త ఓటర్లను చేర్చి .. పారదర్శకమైన ఓటర్ల జాబితాను రెడీ చేసేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఈ ప్రకటనతో పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ రెండో వారంలో నిర్వహించడానికి ప్రక్రియ ప్రారంభించినట్లయింది.

కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఓటర్ల జాబితా సవరణ

TSEC ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ నవంబర్ 20న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాలు, తప్పులు సరిదిద్దడం వంటివి చేస్తారు. ఇరవయ్యో తేదీన ఓటర్లు తమ గ్రామ పంచాయతీ కార్యాలయాలు, బూత్‌ లెవల్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఓటర్లు 18 ఏళ్లు పూర్తి చేసినవారు, పేరు తప్పులు, అడ్రస్ మార్పులు, మరణించినవారి పేర్ల తొలగింపు వంటి అంశాలపై దరఖాస్తులు చేసుకోవచ్చు. ఓటర్ల జాబితా అభ్యంతరాలు పరిష్కరణ ఇరవై రెండోతేదీన ఉంటుంది. ఈ రోజు బూత్‌లెవల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అర్హత తనిఖీలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ దశలో జరుగుతాయి.

నవంబర్ 23న తుది ఓటర్ల జాబితా సవరణ

నవంబర్ 23న చివరి ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ స్టేషన్లు ధృవీకరణ ఉంటుంది. సవరించిన ఓటర్ల జాబితాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఈ ప్రక్రియలో ఓటర్లు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ వంటి డాక్యుమెంట్లు సమర్పించాలి. ఆన్‌లైన్‌లో కూడా (tsvs.eci.gov.in) దరఖాస్తు చేసుకోవచ్చు. TSEC అధికారులు, "ఈ సవరణ ద్వారా 18-19 ఏళ్ల యువతను, మహిళలను మావట జాబితాల్లో చేర్చి, ఎన్నికల పారదర్శకతను పెంచుతాము" అని తెలిపారు. ఈ కార్యాచరణ రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో జరుగుతుంది.

మూడు దశల్లో 12వేలకుపైగా పంచాయతీల్లో నెలలో పూర్తి

సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించే అవకాశం ఉంది. ప్రతి దశ మధ్య గరిష్టంగా ఐదు రోజుల వ్యవధి ఉంటుంది. ఈ మేరకు, డిసెంబర్ రెండో వారం నుంచి నెలలో మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు పార్టీ సింబుల్స్ లేకుండా (నాన్-పాలిటికల్) జరుగుతాయి, కానీ పార్టీలు తమ మద్దతును అభ్యర్థులకు అందించవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 42 శాతం బీసీ కోటాను అమలు చేస్తామని ప్రకటించింది.