Telangana Municipal Polls: హీటెక్కిన మున్సిపల్ పోరు.. ఇబ్రహీంపట్నంలో కిడ్నాప్ ఆరోపణలు! తొర్రూరులో ఎర్రబెల్లికి చేదు అనుభవం!

2 months ago 8
ARTICLE AD

తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు 7 కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు పలుచోట్ల రణరంగంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు మెజారిటీ రాకుండా హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పార్టీల కార్యకర్తలు పోలీసుల ఎదుటే బాహాబాహీకి దిగుతున్నారు. పలు మున్సిపాలిటీ ఆఫీసుల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను సైతం రంగంలోకి దింపుతున్నారు.

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం నాడు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ మేయర్, ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో 19వ వార్డు సభ్యుడు ఆకుల యాదగిరి అదృశ్యం కావడం కలకలం రేపింది. తన భర్తను కిడ్నాప్ చేశారంటూ యాదగిరి భార్య మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తన తండ్రిని చూపించాలని, ఆయన ఓటింగ్ కు రాకుండా కిడ్నాప్ చేశారని యాదగిరి కుమారుడు ఆరోపించారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ వార్డు సభ్యుడు యాదగిరిని బలవంతంగా క్యాంపుకు తీసుకెళ్లారని కుటుంబసభ్యులు ఆరోపించారు.

నేడు జరుగుతున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తన భర్త యాదగిరి హాజరు కాలేని పరిస్థితి ఉందని, కాబట్టి ఎన్నికలను తక్షణమే వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆమె ధర్నా చేపట్టారు. అనంతరం తన కుమారుడితో కలిసి ఇబ్రహీంపట్నం ఆర్డీవో (RDO) అనంత రెడ్డిని కలిసి తన భర్తను రక్షించాలని, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ పరిణామంతో మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తన తండ్రిని చూపించాలంటూ ఆందోళనకు దిగి, అక్కడే బైటాయించాడు. ఓ నేతను కిడ్నాప్ చేస్తే పట్టించుకోరా, ఇదేనా ప్రజాస్వామ్య పాలన అని ప్రశ్నించారు.

జనగాలో కౌన్సిలర్ల వాహనాలపై దాడులు, పోలీసుల మోహరింపు
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వేళ జనగామ మండలం పెంబర్తి బైపాస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళ్తున్న వాహనాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని, వారిపై దాడులకు దిగారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. ఈ క్రమంలో రెండు పార్టీల నాయకుల మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టాల్సి వచ్చింది.

తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత
మరోవైపు, తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కాంగ్రెస్ పార్టీ నేతలు, పోలీసులు అడ్డుకున్నారు. అయితే తాను విప్ జారీ చేసిన పత్రాలు అందజేసేందుకు మున్సిపల్ ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పినా అడ్డుకున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. అమెరికా పౌరులను సైతం తొర్రూరు మున్సిపాలిటీ ఆఫీసులోకి అనుమతిస్తున్నారు, కానీ తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అమెరికా పౌరసత్వం ఉన్న ఝాన్సీని మున్సిపాలిటీ ఆఫీసులోకి ఎందుకు అనుమతించారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే రాజకీయ వర్గాల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొనడంతో ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో సాధారణ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బలగాలను మోహరించారు. సెక్షన్ 144 అమలు చేస్తూ, అపరిచిత వ్యక్తులు లోపలికి రాకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.

Read Entire Article