Telangana Latest News: తెలంగాణలో ఎరువుల కొరత ఉందంటు జరిగిన ప్రచారంపై కేంద్రమంత్రి స్పందించారు. కావాలనే కొరత సృష్టింటే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎరువుల కొరత ఉందంటూ సోషల్ మీడియాలో ప్రధాన ప్రతిపక్షం ఆరోపణలు చేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు హరీష్‌రావు.

తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరతపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దేశంలో రైతాంగానికి అండగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని నిలబడిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో వేసిన వేల మాట్లడుతూ ఏడాదికి మూడు సార్లు, ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. వందకు వందశాతం రైతుల పంట ఉత్పత్తులు పెంచేందుకు, సాగు, ఎరువులు, విత్తనాలు ఖర్చుల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా ఈ నిధులు ఉపయోగపడుతున్నాయని అన్నారు. అనేక అడ్డంకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఉన్నా కేంద్రప్రభుత్వం రెగ్యులర్‌గా పీఎం కిసాన్ నిధులు అందజేస్తుందన్నారు కిషన్ రెడ్డి. 19వ విడత డబ్బులు 9.08 కోట్ల మంది అకౌంట్లలో రూ. 22 కోట్లు జమ చేశామన్నారు. తెలంగాణలో 31 లక్షల మంది రైతులు లబ్ధి పొందారన్నారు. డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ కింద పీఎం కిసాన్ సన్మాన్ నిధి డబ్బులు అందజేస్తున్నామన్నారు.

ఇటీవల తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు క్యూలైన్లలో చెప్పులు పెట్టుకొని ఎరువుల కోసం ఎదురు చూస్తున్నట్లు వార్తలు వచ్చాయన్నారు. దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి జేపీ నడ్డాతో మాట్లాడానన్నారు. అనేక ప్రాంతాల్లో రైతులు ఎరువుల కోసం ఆందోళన చేస్తున్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తే, ప్రభుత్వం అడిగిన దాని కంటేఎక్కువ కోటా విడుదల చేశామన్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే కొంతమంది వ్యాపారస్థులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి.

పాత అలవాటు ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు కిషన్‌ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వ అంచనాల ప్రకారం 2024–25 రబీ సీజన్ 9.5 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరమున్నట్లు, కేంద్రం జాయింట్ సమావేశంలో నిర్ణయించాయన్నారు. కేంద్రం పది లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు పంపించిందన్నారు. 1 అక్టోబర్ నుంచి 22 ఫిబ్రవరి వరకు కూడా తెలంగాణలో యూరియా అందుబాటులో ఉందన్నారు. గతేడాదితో పోలిస్తే 27.37 శాతం అత్యధికంగా కేంద్రం సరఫరా చేసిందన్నారు. 22వ తేది ఫిబ్రవరిలో 40వేల టన్నుల యూరియాను కేంద్రం అదనంగా పంపిందన్నారు. 23, 24 తేదీల్లో అదనంగా మరో 48వేల టన్నుల యూరియా ముందు జాగ్రత్త చర్యగా కేంద్రం రైతాంగాన్ని ఆదుకోవడం కోసం పంపిస్తున్నట్లు వెల్లడించిందన్నారు.

Also Read: తెలంగాణలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన వాళ్లకు గుడ్ న్యూస్- పంపిణీ ఎప్పటి నుంచి అంటే?

మూడు రోజుల్లో 16వేల టన్నుల యూరియాను పంపిందన్నారు. లెక్కల్లో 1.22 లక్షల టన్నుల యూరియా.. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా 1.22 లక్షల టన్నుల యూరియా లెక్కల్లో ఉందన్నారు. ఇదిగాక 6వేల టన్నులు ఆంధ్రప్రదేశ్‌ పోర్టుల నుంచి తెలంగాణకు తీసుకువచ్చేందుకు ప్రణాళిక చేశామన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా తెలంగాణకు ఎరువుల సరఫరా చేస్తుందన్నారు. యూరియాను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అందుబాటులో ఉంచామన్నారు. వీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. కేంద్రం కావాల్సిన స్దాయిలో ఎరువులు తెలంగాణకు పంపినా , రైతులు క్యూలో ఉండడం దురదృష్టకరమన్నారు.

Also Read: రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?