Telangana Jagruti Resolution: ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ మాతగా నామకరణం- తెలంగాణ జాగృతి తీర్మానం

11 months ago 8
ARTICLE AD

BRS MLC Kavitha News | హైదరాబాద్: తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ మాతగా నామకరణం చేస్తూ తెలంగాణ జాగృతి తీర్మానం చేసింది. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లు ఉంటుందని, కానీ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకపోతే మన సమాజంలో స్నేహశీలత, సుహృధ్భావం ఎలా కనిపిస్తుంది ? అని ప్రశ్నించింది.

ఆస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదు

తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ‘మన సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కనుక సీఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజం గుర్తుకొస్తుంది. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుంది. అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందని బతుకమ్మ సందేశం ఇస్తుంది. మన అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అలాంటి ప్రయత్నాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన అవసరం మనకు ఉంది. తెలంగాణ ఉనికి, సంస్కృతిపై దాడి జరుగుతుంటే మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ రేవంత్ రెడ్డి ఎక్కడా లేరు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారు రేవంత్ రెడ్డి. ఉద్యమకాలంలో ఉద్యమకారులపై తుపాకీ ఎక్కిపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఉద్యమ సమయంలో నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తాం.

తెలంగాణ తల్లి వైభవంపై పద్యాలు, కవితలు
ఒక చేతిలో చేతిలో బతుకమ్మ, మరొక చేతిలో జొన్నకర్ర ధరించిన తెలంగాణ తల్లి వైభవంపై పద్యాలు, కవితలు రచించి పుస్తకాలు వెలువరిస్తాం. పిల్లలు వాడే నోట్ బుక్స్, రైటింగ్ ప్యాడ్స్ పై తెలంగాణ తల్లిని ముద్రించి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ తల్లికి ఆరాధానతో కార్యక్రం మొదలుపెట్టే సంప్రదాయాన్ని కొనసాగిస్తాం. తెలంగాణ తల్లి విగ్రహాలను గ్రామ గ్రామానా ప్రతిష్టించాలని నిర్ణయం తీసుకున్నాం. బతుకమ్మ కేవలం అగ్రవర్ణాల పండుగ అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ జాతికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విగ్రహానికి కాంగ్రెస్ మాతగా నామకరణం చేస్తూ తీర్మానం చేశామని’ కవిత వెల్లడించారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగం

తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగాన్ని తలపించింది. కానీ ఏడాది కాంగ్రెస్ పాలన పాత చీకటి రోజులను గుర్తు చేస్తుంది. శిల్ప శాస్త్రం ప్రకారం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారు. తెలంగాణ తల్లి గొప్పగా కనిపించాలి.. కానీ బీదగా ఉండవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను దెబ్బతీయసే కుట్ర చేస్తోందని’ అన్నారు.

Also Read: Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి

Read Entire Article