IAS takes VRS due to tender dispute: తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎ.ఎం. రిజ్వీ మధ్య అంతర్గత విభేదాలు అధికార, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ారింది. రిజ్వీ వాలంటరీ రిటైర్‌మెంట్ సర్వీస్ (VRS) దరఖాస్తు చేయడం, దానిని మంత్రి జూపల్లి వ్యతిరేకించడం ద్వారా ఈ వివాదం రాజకీయ దుమారం రేపింది. అయితే రిజ్వీ వీఆర్ఎస్‌ను చీఫ్ సెక్రటరీ ఆమోదించారు.

ఎక్సైజ్ శాఖలో హై-సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్ కారణంగా ఈ వివాదం ప్రారంభమయింది. మద్యం బాటిళ్లపై అంటించే హోలోగ్రామ్ లేబుల్స్ కోసం రూ.100 కోట్ల విలువైన టెండర్‌ను రిజ్వీ ఆలస్యం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఈ హోలోగ్రామ్‌లు బార్‌కోడ్, ఐటీ ట్రాకింగ్ సిస్టమ్‌తో ఉండి, అక్రమ మద్యం వ్యాపారం, నకిలీ బాటిళ్లు, ఎక్సైజ్ పన్ను ఎగవేతలను నిరోధిస్తాయని.. మంత్రి జూపల్లి చెబుతున్నారు. 2019 నుంచి పాత వెండర్‌నే కొనసాగించడం వల్ల సమస్యలు వస్తున్నాయని మంత్రి చెబుతున్నారు. ఎన్ని సార్లు అడిగినా రిజ్వీ పట్టిచుకోలేదని.. ఫిర్యాదులపై ఎన్నిసార్లు నివేదికలు కోరినా రిజ్వీ ఇవ్వలేదని, మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని సీఎస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఈ వివాదం 2024 నుంచేసాగుతోంది. ఆగస్టు 13, 2024 ఎక్సైజ్ కమిషనర్‌కు మంత్రి జూపల్లి హోలోగ్రామ్ టెండర్‌లను వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సెప్టెంబర్ నుంచి ఈ ప్రాసెస్ నడుస్తోంది. డిసెంబర్‌లో ఫైల్‌ను రిజ్వీ ముఖ్యమంత్రికి పంపారు. మంత్రిని పట్టించుకోలేదు. ఫిబ్రవరిలో డ్రాఫ్ట్ EoI తయారు చేయాలని జూపల్లి ఆదేశించారు. కానీ రిజ్వీ పట్టించుకోలేదు. ఈ వివాదం కారణంగా
రిజ్వీ VRS దరఖాస్తు చేశారు. ప్రభుత్వం ఆమోదించింది. అక్టోబర్ 31, 2025 నుంచి అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రిజ్వీ స్థానంలో ఎం. రఘునందన్ రావును ఫుల్ అడిషనల్ చార్జ్‌లో నియమించారు.

అయితే అంతకు ముందే మంత్రి జూపల్లి ఈ VRSను తిరస్కరించాలని, రిజ్వీపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 221 కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. బ్యూరోక్రాట్లను హరాస్ చేస్తున్నారని ఆరోపించారు. రిజ్వీ మంత్రి ఆదేశాలను పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి అల్లుడు, మంత్రి కొడుకు పంచాయితీలో ఐఏఎస్ అధికారి సయ్యద్‌అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వెళ్ళేలా ఇబ్బంది పెట్టారు అని ఆరోపించారు.#KTR #iasrizvi… pic.twitter.com/lH2xAGzhNT

— ABP Desam (@ABPDesam) October 23, 2025

ఈ అంశం ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి జూపల్లి మధ్య కూడా విబేధాలకు కారణం అయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.