<p><strong>BJP Lead:</strong> కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి 24 ఓట్లతో ముందంజ వేశారు. మొత్తం 14 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది. మొదటి రౌండ్‌లో <a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a> అభ్యర్థి మైల్ అంజిరెడ్డికి 6697 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి 6673 ఓట్లతో ఉన్నారు. మూడో స్థానంలో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 5897 ఓట్లు సాధించారు. </p>