Telangana Bhavan Republic Day Play controversy: తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రదర్శించిన ఒక నాటిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ నాటికలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్‌ని లక్ష్యంగా చేసుకుని అవమానకర రీతిలో పాత్రలను చిత్రీకరించారని విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, సభాధ్యక్షుడు అయిన స్పీకర్‌ను కించపరిచేలా రాజకీయ వేదికలపై ఇలాంటి ప్రదర్శనలు చేయడం తగదని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

ఈ ప్రదర్శనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. రిపబ్లిక్ డే వంటి పవిత్రమైన రోజున, రాజ్యాంగ విలువలను గౌరవించాల్సింది పోయి, రాజకీయ కక్షతో ఇలాంటి దిగజారుడు నాటకాలు ఆడించడం బీఆర్ఎస్ సంస్కృతికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సభాపతిని ధృతరాష్ట్రుడితో పోల్చడం ఏమిటని సభ్యుడిగా మీకు సంస్కారముందా అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని అవమానించడం మీది ఏ రాజనీతి... కే రాజ్యాంగ వ్యతిరేకులుగా మారి, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నాటకాలు వేస్తున్నారు, నాటకాలు ఆడిస్తున్నారు అని ఎమ్మెల్సీ విమర్శించారు.

రాజ్యాంగ పరిరక్షణ – ప్రజాస్వామ్య విలువలపై తెలంగాణ భవన్‌లో నాటిక ప్రదర్శన

పార్టీ ఫిరాయింపు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యాంగం కూని తదితర అంశాలపై నాటిక

హాజరైన కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు pic.twitter.com/WaRj88Yf2T

— Sai Ram Guptha Andole BRS (@sairam_brs) January 26, 2026

తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వెక్కిరించేలా సంభాషణలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒక జాతీయ పండుగ రోజున రాజకీయ విద్వేషాలను ప్రదర్శించడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. కేటీఆర్ సమక్షంలోనే ఇలాంటి నాటికలు ప్రదర్శించడం వెనుక వారి ప్రోద్బలం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే అంబేద్కర్ తత్వాన్ని అద్భుతంగా ఆకళింపు చేసుకున్న నాయకుడు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని తెలంగాణ ప్రజలకు బోధిస్తూ, వాళ్లను సమీకరిస్తూ, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగినా వారి గొంతుకై ప్రశ్నిస్తూ, 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ… pic.twitter.com/zOfOEL4DlN

— BRS Party (@BRSparty) January 26, 2026

ఈ వివాదంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రాజకీయ విమర్శలు ఉండవచ్చు కానీ, ఒక వ్యవస్థను , వ్యక్తులను కించపరిచేలా నాటకాలు వేయడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతున్నారు.