Telangana Armed Struggle: తెలంగాణ సాయుధ పోరాటంలో చరిత్ర చెప్పని సంచలన విషయాలు.. కమ్యూనిస్టుల పాత్ర..!

2 months ago 3
ARTICLE AD

హైదరాబాద్: బ్రిటిష్ పాలనలోనే భారత దేశంలో 500 పైగా సంస్థానాలు కొనసాగుతున్నాయి. అందులో ఒకటి నిజాం పాలకుడుగా హైదరాబాద్ సంస్థానం ఉన్నది. నిజాం నిరంకుశత్వానికి ఫ్యూడల్ దోపిడీకి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 1946 నుండి 1951 వరకు తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింది. దోపిడికి అణచివేతకు వివక్షతకు గురి అవుతున్న శ్రామిక ప్రజలు దున్నేవానికి భూమి అనే నినాదంగా, భూమి భుక్తి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో గొప్ప ఉద్యమ ఐక్యత ప్రదర్శించారు.

తెలంగాణలో నిరంకుశ పాలకుడైన నిజాంకు వ్యతిరేకంగా , కొందరు నిజాం దళారులైన హిందూ అగ్రకుల భూస్వాముల అధిపత్యాన్ని కూల్చివేస్తూ తెలంగాణ రైతాంగం మూడు వేల గ్రామ రాజ్యాలు స్థాపించినారు.10 లక్షల ఎకరాల భూములను భూస్వాముల నుండి ప్రజా ఉద్యమాలతో స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉద్యమంలో 3 వేల మంది కమ్యునిస్ట్ యోధులు అమరులైయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఓ కులానికో, ఓ మతానికో వ్యతిరేకమైన పోరాటం కాదు. అన్ని కులాల్లోని, అన్ని మతాల్లోని పీడిత ప్రజలు ఐక్యంగా భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా, భూస్వామ్య ప్రభువైన నిజాంకు వ్యతిరేకంగా ఒక్కటైన వర్గ పోరాట తిరుగుబాటు.

నిజాంతో కేంద్రం లాలూచి.. అందుకే విలీన మంత్రం..!

బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో భారత బూర్జువా వర్గం రాజీ ఒప్పందాలతో 1947 ఆగస్టు 15 స్వాతంత్రం ప్రకటించబడింది.నెహ్రు పటేల్ నాయకత్వంలోని కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఇండియాలో విలీనం కాకుండా ప్రత్యేక రాజ్యంగానే కొనసాగుతామంటున్న నిజాం రాజ్యంపై సెప్టెంబర్ 13 నుండి 17 వరకు ఆపరేషన్ పోలో పేరుతో సైనిక దాడిని నిర్వహించింది. ఇదే కాలం నాటికి తెలంగాణ సాయుధ పోరాటం ఉవ్వెత్తున కొనసాగుతూ నిజాంను చుట్టుముట్టి నిజాం సైనికులైన రజాకార్లను దెబ్బతీస్తూ పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.. నిజాం కొనసాగిస్తున్న అణచివేత పై సుదీర్ఘకాలం మౌనంగా ఉన్న కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం, అకస్మాత్తుగా నాటకీయంగా హైదరాబాద్ పై కొనసాగించిన మిలటరీ దాడి కుట్రపూరితమైయ్యిందనే వాదనలు అప్పట్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిజాం రాజుతో కుమ్మకై నాటకీయమైన దాడి మాత్రమేనని నిజాంకు ఇచ్చిన బిరుదులు, భరణాలలే నిదర్శనమనే విమర్శలున్నాయి.

పటేల్ యూనియన్ సైన్యాలు భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్టు ప్రజలను, గెరిల్లాలను చంపడం, అణచివేయడం ద్వారా నిజాం, కేంద్రప్రభుత్వాల లాలూచి బహిర్గతమైయ్యింది కమ్యూనిస్టులు భావించారు. దున్నేవారికే భూమి కోసం పోరాడుతున్న ఉద్యమాన్ని అణిచివేసి భూస్వాముల భూముల రక్షణ కొనసాగించిన పటేల్ ,నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ విధానాలపై అప్పట్లో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైయ్యిందట.నిజాం రాజ్యంలోని కరుడు గట్టిన భూస్వామ్య అధికారం నుండి బూర్జువా నాయకత్వంలోని భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గాలకే అధికారం చట్టబద్దం చేయడమే తెలంగాణ విలీన ప్రక్రియ అనే వాదనలు విపించాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని రక్తపుటేరుల్లో ముంచి, కేంద్ర పాలకులు తెలంగాణను విలీనం చేసారనే విమర్శలున్నాయి.విలీనం అంటే భూస్వాములు, పెట్టుబడిదారులు కుమ్ముకైయ్యారనే సంకేతాలు అప్పట్లో జనాల్లోకి వెళ్లాయి. తెలంగాణా లక్షలాది ప్రజలపై పటేల్ సైన్యం జరిపిన మారణకాండను కీర్తించే బూర్జువా భూస్వామ్య వర్గాల ద్రోహాన్ని విలీన దినంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారనే వాదనలు ఉన్నాయి.

ప్రజలపై ఊచకోతే విమోచన దినమా..!?

భూస్వామ్య వర్గాలకు బ్రిటిష్ వలస వాదులందరికి ఆర్ఎస్ఎస్( బిజెపి) పూర్తిగా నమ్మకమైన సంస్దగా నిలబడిందనేది ఓ వర్గం అభిప్రాయం. వివిధ మతాలకు చెందిన భూస్వాములకు సామ్రాజ్యవాదులకు తమ సేవలు అందించడంలో బిజెపికి మతం అడ్డు రాలేదు.కానీ విచిత్రంగా బిజెపి పటేల్ సైన్యాలు నిజాంతో జరిగిన లాలూచీని ముస్లిం విమోచనగా చెబుతారు. నిరంకుశ నైజాంకు బలమైన మద్దతుదారులు జమీందారులు జాగిర్దారులైన విసునూరు రామచంద్రారెడ్డి లాంటి హిందూ మతములోని అగ్రకుల భూస్వాములే.ముస్లిం హిందూ పాలకుల ఐక్య దోపిడీకి మత అడ్డంకులు ఏమీ లేవు. వారు దోపిడీ చేయడానికి హిందూ ముస్లిం వివక్షత ఏమి లేదు. ఈ ప్రజా ఉద్యమంలో కులమత విభేదాలు లేని ఐక్య పోరాటం కొనసాగి దొడ్డి కొమరయ్య, బందగి, షోయబుల్లఖాన్, ఐలమ్మఆరుట్ల రామచంద్రారెడ్డి భీమ్ రెడ్డి నరసింహారెడ్డి బందగి లాంటి వివిధ కులాల వివిధ మతాల ప్రజలు వీరులు అమరులైనారు.

కులమత బేధాలు లేని గొప్ప వర్గ పోరాటంపై ముస్లిం విమోచన పోరాటం అని ప్రచారం చేయడం కుట్ర కాదా అనే అభిప్రాయం వక్తమవుతోంది.. ఆనాటి పాలకులలో హిందూ ముస్లిం భూస్వాములు ఉన్నారు. వారికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజలు హిందూ ముస్లిం అయితే బిజెపికి మత విమోచనము ఎలా అవుతుందనేది ప్రధాన ప్రశ్న..? ఇలా చరిత్రను వక్రీకరించి కృత్రిమమైన కట్టు కథలు అల్లడం బిజెపి మత ఉన్మాదంతో కూడుకున్న సంకుచితమైన రాజకీయాలు కావా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

సాయుధ పోరాట విరమణ తరువాత దేశంలో అనూహ్య మార్పులు..

గడిచిన 78 యేండ్లలో ప్రపంచంలో దేశంలో, తెలంగాణలో అనేక ముఖ్యమైన మార్పులు జరిగాయి. 1947 ఆగస్టు స్వాతంత్ర అనంతరం భారత బూర్జువా రాజకీయ వ్యవస్థ పరిపాలన ప్రారంభమైంది. చట్టసభలు, కోర్టులు, జైలు, పోలీసు మిలటరీ పరిపాలన విభాగాలతో వివిధ రూపంలో భారత రాజ్యం బలోపేతం అయింది. బూర్జువా రాజ్యాధికారం ద్వారా 550 కి పైగా నిజాం లాంటి ఫ్యూడల్ సంస్థానాలను రద్దు చేయడం జరిగింది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్య వ్యవస్థను రాడికల్ గా మార్చడానికి బూర్జువా పాలకవర్గం మెతక వైఖరి , రాజీలు సంస్కరణ వైఖరి కొనసాగించిన ఫలితంగా కొన్ని గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్య వ్యవస్థ ఇంకా కొనసాగుతుండటంతో నక్సల్ బరి శ్రీకాకుళం తెలంగాణ లాంటి అనేక ప్రాంతాలలో భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు తీవ్రమైయ్యాయి. ఈ పోరాటాల ఫలితమే పాలకవర్గాలు అనివార్యంగా కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న పెట్టుబడిదారీ విధానం ,భారతదేశంలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నపెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం , భూస్వామ్య వ్యతిరేక సాయుధ పోరాట ఉద్యమాలు భూస్వామ్య వ్యవస్థను తీవ్రంగా నాశనం చేసింది. భూస్వాములు పెట్టుబడిదారీ వర్గాలుగా మారిపోయినారు.

భారత బూర్జువా వర్గాల రాజ్యాధికారంలో పెట్టుబడిదారీ విధానం 1947 నుండి క్రమక్రమంగా పెరుగుతూ అన్ని ప్రాంతాల్లో అన్ని రంగాల్లో సంఘటితమవుతూ వచ్చింది. ఈ పెట్టుబడిదారీ విధానం కారణంగానే 60 కోట్ల సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గాన్ని శ్రమ దోపిడీకి గురి అవుతూ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పేద మధ్యతరగతి రైతాంగం పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. చిన్న ఉత్పత్తిదారులు చిన్న వ్యాపారులు గుత్త పెట్టుబడిదారీ సంస్థల మూలంగా, ప్రభుత్వ విధానాల మూలంగా తీవ్రంగా నష్టపోతున్నారు. గుత్త పెట్టుబడి దారి (కార్పొరేట్) విధానాల ఫలితంగా దేశంలోని కార్మికులు రైతులు ఉద్యోగస్తులు చిన్న మధ్య వ్యాపారస్తులు ఆదివాసులు దళితులు మహిళలు విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలు దోపిడీకి అణిచివేతకు వివక్షతకు గురైయ్యారు. ఏ దిక్కు చూసినా పెట్టుబడిదారీ విధానం భయానకంగా ఉన్నది. ప్రజలను ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా పర్యావరణ పరంగా శారీరకంగా మానసికంగా కుటుంబ పరంగా దోపిడీ చేస్తున్నది అణచివేస్తున్నది ఒత్తిడికి గురి చేస్తున్నది తీవ్రమైన నష్టాలకు గురిచేసేది పెట్టుబడిదారీ వర్గాలు, పెట్టుబడిదారీ విధానమే అనే ఆరోపణలున్నాయి. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిగా, తమ అస్తిత్వ సమస్యలపై విడిగా ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం అవసమైయ్యింది. చట్టబద్ధంగా తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడానికి సంఘటితంగా కృషి చేయాల్సి వచ్చింది.

నేడు వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఎత్తిపట్టడం అంటే శ్రామిక వర్గానికి చెందిన అన్ని కులాల అన్ని మతాల , పీడిత ప్రజలను ఐక్యము చేస్తూ పెట్టుబడి దారి దోపిడీకి అణిచివేతకు వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన పరిస్దితులు ఎర్పడుతున్నాయి. నేడు పోరాటం అంటే దేశంలోని అన్ని ప్రాంతాలలో అన్ని వర్గాలు పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా సంఘటితమైన, శ్రామిక రాజకీయ అధికారాన్ని నెలకొల్పే దిశగా కొనసాగడానికి నిర్ణయించుకోవడమే నేటి తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవ స్ఫూర్తి.

- జంపన్న (డెమొక్రటిక్ సోషలిస్ట్)

Read Entire Article