Men In Blue Clinch Historic Gold Medal Outclassing Arch Rivals In Japan: ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ మహారంగంలో భారత్ మరోసారి ఛాంపియన్‌గా అవతరించింది. శనివారం నిషిన్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో జరిగిన హైవోల్టేజ్ గోల్డ్ మెడల్ ఫైనల్ పోరులో భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించి, 19 ప‌రుగుల‌తో గెలుపొందంది. అంత‌కుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయానికి బ్యాటర్లు పూర్తిగా న్యాయం చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ సూప‌ర్బ్ ఫిఫ్టీ (28 బంతుల్లో 61, 3 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. సాద్ ద‌నియాల్, అరాఫ‌త్ మిన్హాస్ చెరో రెండు వికెట్ల‌తో స‌త్తా చాటారు. అనంతరం 212 పరుగుల కొండంత లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఓవ‌ర్ల‌న్నీ ఆడి 6 వికెట్ల‌కు 192 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.. హసన్ నవాజ్ (51 బంతుల్లో 96, 5 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) ఒంటరి పోరాటం చేసినప్పటికీ మిగతా బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. దీంతో భారత్ ఘన విజయం సాధించి 2023 హాంగ్జౌ క్రీడల్లో సాధించిన స్వర్ణ పతకాన్ని విజయవంతంగా నిలబెట్టుకుంది. బౌల‌ర్ల‌లో శివ‌మ్ దూబే, అక్ష‌ర్ ప‌టేల్, వాషింగ్ట‌న్ సుంద‌ర్ త‌లో రెండు వికెట్లు తీశారు.

𝙂𝙊𝙇𝘿-standard performance ✨🥇

Scorecard ▶️ https://t.co/g4wzZagyGj#TeamIndia | #AsianGames | @OfficialAbhi04 pic.twitter.com/RB9vv1ikcb

— BCCI (@BCCI) October 3, 2026

అభిషేక్, తిలక్ వర్మ విధ్వంసం.. స్కోరు బోర్డు పరుగులు
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాకు ఓపెనర్ అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 28 బంతుల్లోనే మెరుపు వేగంతో 61 పరుగులు సాధించి పాక్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చాటాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ ధనాధన్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 22 బంతుల్లోనే అజేయంగా 51 పరుగులు బాది జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. ఆఖర్లో దూకుడు ప్రదర్శించిన శివమ్ దూబే 14 బంతుల్లోనే 27 పరుగులు జోడించడంతో భారత్ 200 పరుగుల మార్కును దాటి 211 పరుగుల భారీ టోటల్‌ను అందుకుంది.

𝗚𝗢𝗟𝗗 𝗠𝗘𝗗𝗔𝗟𝗟𝗜𝗦𝗧𝗦 𝗔𝗚𝗔𝗜𝗡 🥇

Congratulations #TeamIndia for successfully defending the Asian Games Gold Medal 👏👏

Scorecard ▶️ https://t.co/g4wzZagyGj#AsianGames pic.twitter.com/sg7z4dhUzH

— BCCI (@BCCI) October 3, 2026

బంతితో బెంబేలెత్తించిన భారత బౌలర్లు.. తలో రెండు వికెట్లు
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ను భారత బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. రన్‌రేట్ ఒత్తిడిని పెంచుతూ క్రమం తప్పకుండా వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీశారు. భారత స్టార్ స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లతో పాటు ఆల్‌రౌండర్ శివమ్ దూబే అత్యంత క్రమశిక్షణతో బౌలింగ్ చేసి చెరో రెండు కీలక వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. పాకిస్తాన్ ప్రధాన బ్యాటర్లను స్వల్ప స్కోర్లకే పెవిలియన్ పంపి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. ఓ ఎండ్ లో న‌వాజ్ నిల‌క‌డ‌గా నిలిచిన‌ప్ప‌టికీ, అత‌నికి స‌హాకారం అందించేవారు క‌రువ‌య్యారు.

వరుసగా రెండోసారి పసిడి ధమాకా.. ఆసియా వేదికపై భారత్ రికార్డు
గత 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్న భారత పురుషుల జట్టు, ఇప్పుడు 2026 నిషిన్ వేదికగా జరిగిన తుది సమరంలోనూ దాయాదిని మట్టికరిపించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. సమష్టి ప్రదర్శనతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసి ఆసియా క్రీడల క్రికెట్ విభాగంలో తమ సంపూర్ణ‌ ఆధిపత్యాన్ని చాటుకుంది.