TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
1 week ago 2
ARTICLE AD
అలాగే సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ 22 స్థానాల్లో 73 శాతం అనగా 16 స్థానాలను బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించారు. వీరిలో ఆరుగురు బీసీ, ఐదుగురు ఎస్సీ, ఐదుగురు మైనారిటీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. ఈ రెండో లిస్టులో ముస్లిం వర్గానికి చెందిన ఐదుగురు అభ్యర్థులకు అవకాశం దక్కగా మచిలీపట్నం, నాయుడుపేట, నందికొట్కూరు, కదిరి, ఆకివీడులలో ముస్లిం నేతలను ఛాన్స్ వచ్చింది. ఈ ఐదుగురిలో నలుగురు మహిళలే ఉన్నారు.
టీడీపీ మున్సిపల్ ఎన్నికలు 2026 - ఖరారైన అభ్యర్థులు (రెండవ జాబితా)
మున్సిపల్ కార్పొరేషన్లు
మచిలీపట్నం: షేక్ అబ్దుల్ అబిదా
మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు (21):
ఆకివీడు: నిలోఫర్ షేక్
బేతంచెర్ల: ఐ. లోకేష్ గౌడ్
బుచ్చిరెడ్డిపాలెం: దోడ్ల విజయలక్ష్మి
చీరాల: యెరిచర్ల హనీ స్పందన
డోన్: కొట్ల సుజాతమ్మ
గుత్తి: గోవిందరాజులు తమిళ్ సెల్వి
గుంతకల్లు: యశోద
జంగారెడ్డిగూడెం: దొంగల అనుష
కదిరి: షేక్ సమీరా
కళ్యాణదుర్గం: బుట్న లక్ష్మి
కొండపల్లి: కన్నెకంటి అమూల్య
కొవ్వూరు: జొన్నలగడ్డ రాధారాణి
నాయుడుపేట: షకీరా
నందిగామ: శాకమూరి వంశీధర్
నందికొట్కూరు: ఈ.ఎం. సబురున్నిసా
నర్సీపట్నం: చింతకాయల పద్మావతి
ప్రొద్దుటూరు: నంద్యాల రాఘవరెడ్డి
వెంకటగిరి: దొంతు శారద
ఉయ్యూరు: చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్
ఏలేశ్వరం: యార్లగడ్డ అక్షిత
ఎమ్మిగనూరు: మాచాని సునీత
టీడీపీ పట్టణ స్థానిక సంస్థల తొలి జాబితా అభ్యర్థులు వీరే
ఈ జాబితాలో యువతకు, విద్యావంతులకు  తగిన స్థానం లభించింది. ఆరుగురు అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువగా ఉండగా, అభ్యర్థుల సగటు వయసు 45.9 సంవత్సరాలుగా ఉంది. విద్యార్హతల విషయానికి వస్తే, ఇందులో సగం మంది డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఉన్నారు.
ఇప్పటివరకు ప్రకటించిన రెండు జాబితాలను పరిశీలిస్తే టీడీపీ మొత్తం 58 మంది అభ్యర్థులను వెల్లడించింది. ఈ 58 మందిలో 64 శాతం అంటే 37 మంది మహిళా అభ్యర్థులు ఉండగా, 66 శాతం అనగా 38 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారే ఉన్నారు. వర్గాల వారీగా చూస్తే బీసీ 22, ఓసీ 20, ఎస్సీ 8, మైనారిటీ 7, ఎస్టీ 1 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. వయోపరిమితి పరంగా 58 మందిలో 18 మంది 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు కాగా, 10 మంది 35 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు వారు ఉన్నారు. మొత్తం 58 మంది అభ్యర్థులలో 34 మంది గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నత విద్యావంతులు ఉన్నారు.
Read Entire Article