భారత ఆటోమొబైల్ మార్కెట్లో Hyundai Creta చాలా కాలం నుంచి నమ్మకమైన వాహనంగా ఉంది. ఇప్పుడు Tata Motors కొత్త Tata Sierra ను లాంచ్ చేయడంతో ఈ సెగ్మెంట్లో పోటీ పెరిగింది. టాటా Sierra ను ప్రీమియం లుక్, మోడ్రన్ ఫీచర్స్ తో అందిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో Tata Sierra SUV లేదా Hyundai Creta SUVలలో మీకు ఏది సరైన ఎంపిక అని తేల్చుకోలేకపోతున్నారా.. అయితే వాటి ధర, ఫీచర్లు తెలుసుకుని మీకు కావాల్సిన ఎస్‌యూవీ కొనుగోలు చేసేయండి.

రెండింటి ధర ఎంత?

ధర విషయానికి వస్తే Hyundai Creta ప్రారంభ ధర Tata Sierra కంటే కొంచెం తక్కువగానే ఉంది. దాంతో ఇది లో బడ్జెట్ కొనుగోలుదారులకు ఎక్కువగా నచ్చవచ్చు. హ్యుందాయ్ Creta బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర 10.73 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే Tata Sierra ప్రారంభ ధర 11.49 లక్షల రూపాయలు. అయితే టాప్ వేరియంట్లో ధర  మారుతుంది. టాటా Sierra గరిష్ట ధర రూ.18.49 లక్షలుగా ఉంటే, Creta టాప్ మోడల్ 20.20 లక్షల వరకు ఉంది.

సియెరాలో ఈ ఫీచర్లు చూశారా

Tata Sierra కేబిన్ దీనిని ఇతర ఎస్‌యూవీల నుండి వేరు చేస్తుంది. Tataలో ఇప్పటివరకు దాని అత్యంత ప్రీమియం ఇంటీరియర్ అని, చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారని కంపెనీ పేర్కొంది. టాటా Sierra లో ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఇచ్చారు. ది ఈ సెగ్మెంట్ లో దీనిని ప్రత్యేకంగా చేస్తుంది. దీనితో పోలిస్తే Hyundai Creta లో డ్యూయల్ స్క్రీన్ సెటప్ లభిస్తుంది. Sierra లో 19 అంగుళాల పెద్ద అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. ఇవి దీనికి మరింత పవర్‌ఫుల్, ప్రీమియం లుక్ ఇస్తాయి.

టెక్నాలజీ ఎలా ఉంది ?

రెండు SUVs లో అనేక ఫీచర్లు సమానంగా ఉన్నాయి. కానీ టాటా Sierra కొన్ని విషయాలలో ముందుంది. ఇందులో మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, 12 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, ఫ్రంట్ సీట్స్ కోసం మెరుగైన థై సపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ కేబిన్‌కు మరింత సౌకర్యవంతమైన, లగ్జరీ ఫీల్ ఇస్తాయి. మరోవైపు Hyundai Creta కూడా రోజువారీ అవసరాలకు సౌకర్యవంతమైన సీటింగ్, మీకు ఈజీ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇది ఫ్యామిలీ యూజ్ కోసం మెరుగ్గా ఉంటుంది.

కొత్త Tata Sierra డిజైన్ చాలా భిన్నంగా, కాస్త యూనిక్‌గా ఉంది. ఇందులో పాత Sierra ఛాయలు కనిపిస్తాయి. ఇది దీనిని ప్రత్యేకంగా చేస్తుంది. దీని కలర్ ఆప్షన్స్ కూడా భారత కస్టమర్లకు నచ్చుతాయి. మరోవైపు, Hyundai Creta డిజైన్ కూడా చాలా మోడ్రన్‌గా ఉంది. మీరు లేటెస్ట్ టెక్నాలజీ, ఎక్కువ ఫీచర్లు, ప్రీమియం ఫీల్ కోరుకుంటే Tata Sierra మీకు మంచి ఎంపిక అవుతుంది. మీరు మెరుగైన పెర్ఫార్మెన్స్, మెయింటెనెన్స్, బ్యాలెన్స్డ్ ప్యాకేజ్ కోరుకుంటే Hyundai Creta మీకు మంచి SUV ఛాయిస్ కానుంది.

Also Read: మారుతి నుంచి టాటా వరకు, కియా నుంచి స్కోడా వరకు - 2026లో లాంచ్‌కు సిద్ధమైన 11 ఎలక్ట్రిక్‌ కార్లు