Panneerselvam Joining Vijay TVK Party: తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనాత్మక పరిణామం తెరపైకి వచ్చింది. ఎఐఎడిఎంకే నుంచి నిష్క్రమించి, డీఎంకే తీర్థం పుచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం , ఆయన కుమారుడు, మాజీ ఎంపీ ఓ.పి. రవీంద్రనాథ్ ప్రస్తుతం డీఎంకేలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తమిళ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. డీఎంకేలో చేరి ఆరు నెలలు గడుస్తున్నా తమకు ఎటువంటి కీలక పదవి లేదా ప్రాధాన్యత కలిగిన బాధ్యతలు కేటాయించకపోవడంపై ఓపీఎస్ వర్గం తీవ్ర అసంతృప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారు డీఎంకేను వీడి తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా తేని లోక్‌సభ , అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతాలలో పన్నీర్‌సెల్వానికి డీఎంకే అధిష్ఠానం ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ఈ అసంతృప్తికి ప్రధాన కారణమని తెలుస్తోంది. తేని లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన డీఎంకే ఎంపీ తంగ తమిళ సెల్వన్ జిల్లా రాజకీయాల్లో, ముఖ్యంగా తేని బెల్ట్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పన్నీర్ సెల్వం అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయనను లెక్కలోకి తీసుకోవడంలేదు. అడిపట్టి, బోడినాయకనూర్ తదితర ప్రాంతాల్లో ఓపీఎస్‌కు ఉన్న పట్టును ఎంపీ వర్గం తొక్కిపెడుతోందని, డీఎంకే జిల్లా నాయకత్వం కూడా తమను కలుపుకొనిపోవడం లేదని పన్నీర్‌సెల్వం మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

పార్టీ మార్పు ప్రచారాన్ని ఓపీఎస్ ఇటీవల కొట్టిపారేశారు. డీఎంకేను వీడి టీవీకేలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలు కేవలం రాజకీయ ప్రత్యర్థులు వ్యాప్తి చేస్తున్న గాలివార్తలని, అందులో ఎలాంటి నిజం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు తరచూ పార్టీలు మారుతారనే ప్రచారం ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి ద్రోహం చేయడమేనని స్పష్టం చేసినప్పటికీ, ఆయన అనుచర వర్గం మాత్రం టీవీకే అధినేత విజయ్‌తో చర్చలు జరుపుతోందనే తమిళ మీడియాలో జోరుగా సాగుతున్నాయి.

Former Chief Minister and DMK MLA O. Panneerselvam and his son Ravindranath are holding consultations to quit the DMK and join the TVK. If their decision to join TVK is confirmed, O.Panneerselvam is expected to become the first person to resign from his MLA post after leaving the… pic.twitter.com/D8DPfVM3o1

— Vignesh Theni (@Vignesh_twitz) July 30, 2026

తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకేలో చేరారు. ఓపీఎస్‌ను చేర్చుకునేందుకు విజయ్ కూడా ఆసక్తిగా ఉన్నారు. దక్షిణ తమిళనాడులో తీవ్ర ప్రభావం ఉన్న థేవార్ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడైన పన్నీర్‌సెల్వం గనుక డీఎంకేను వీడి టీవీకేతో చేయి కలిపితే, అది దక్షిణ జిల్లాల్లో టీవీకేకు మరింత పట్టు లభిస్తుంది. తేని రీజియన్‌లో తంగ తమిళ సెల్వన్, ఓపీఎస్ వర్గాల మధ్య సఖ్యత కుదిర్చకపోతే దక్షిణ బెల్ట్‌లో పార్టీకి రాజకీయంగా డీఎంకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఒకవేళ ఓపీఎస్ నిజంగానే టీవీకే వైపు అడుగులు వేస్తే, విజయ్ పార్టీకి అదనపు బలం చేకూరుతుంది.