చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికార డీఎంకే కూటమి మధ్య పొత్తు కుదిరింది. అధికార డీఎంకే (DMK) తన మిత్రపక్షాలతో సీట్ల పంపకాలను పూర్తి చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను డీఎంకే 164 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిగిలిన 70 స్థానాలను తన మిత్రపక్షాలకు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లు ఫిక్స్ చేశారు. ఈ మేరకు శనివారం అధికారిక ప్రకటన విడుదలైంది.

అధికారంలో ఉన్న డీఎంకె (DMK) 164 మంది అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. ఈ అభ్యర్థుల జాబితాలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి పేర్లు ఉన్నాయి. పార్టీ మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులకు మళ్ళీ అవకాశం కల్పించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియ మే 4న ఉంటుంది.

స్టాలిన్- ఉదయనిధి ఎక్కడి నుండి పోటీ చేస్తారు?

డిఎంకె అధినేత స్టాలిన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేశారు. తాను మరోసారి కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఉదయనిధి కూడా చెపాక్- ట్రిప్లికేన్ స్థానం నుంచి మళ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తమిళనాడు మంత్రులు దురై మురుగన్ (డిఎంకె ప్రధాన కార్యదర్శి), కె.ఎన్. నెహ్రూ, అన్బిల్ మహేష్ పొయ్యామొళి, తంగం తెన్నరసు, మా సుబ్రమణియన్, ఈవీ వేలులకు పార్టీ మళ్లీ అవకాశం ఇచ్చింది.

పన్నీర్ సెల్వం బరిలోకి దిగేది ఎక్కడంటే..

AIADMK నుండి బహిష్కరణకు గురైన తర్వాత డిఎంకెలో చేరిన మాజీ సీఎం ఓ. పన్నీర్ సెల్వానికి ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహించిన బోదినాయకనూర్ నియోజకవర్గం నుండే అవకాశం ఇచ్చారు. డీఎంకెలో చేరిన తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పన్నీర్ సెల్వం సహచరులు పాల్ మనోజ్ పాండియన్, ఆర్. వైతిలింగానికి కూడా టికెట్లు దక్కాయి. మాజీ మంత్రి వి.సెంథిల్ బాలాజీ కోయంబత్తూరు సౌత్ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

28 స్థానాల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్

అంతకుముందు డిఎంకె, దాని మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం ఫార్ములా ఖరారైంది. గరిష్టంగా డీఎంకే 164 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. డిఎంకె మిత్రపక్షమైన కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేస్తుంది. తర్వాత వీసీకే (VCK), డీఎండీకే (DMDK) సహా ఇతర పార్టీలు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి. సీట్ల పంపకం పూర్తయిన ప్రకారం కాంగ్రెస్.. పొన్నేరి, శివకాశి, ఈరోడ్ ఈస్ట్, విలవంకోడ్, కారైకుడి ఉన్నాయి. ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు 10 సీట్లు వచ్చాయి. వాటిలో ముఖ్యమైన విరుధాచలం, పల్లవరం ఉన్నాయి.

తోల్ తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే పార్టీకి కట్టుమన్నార్ కోయిల్, పన్రుట్టి, తిండివనం సహా 8 సీట్లు వచ్చాయి. సీపీఎంకు పద్మనాభపురం, పళని సీట్లు లభించాయి. సీపీఐ పార్టీ తళ్ళి, భవానీసాగర్ (రిజర్వ్డ్) తో సహా ఇతర స్థానాల నుండి పోటీ చేస్తుంది. రెండు వామపక్ష పార్టీలకు 5 చొప్పున సీట్లు కేటాయించారు. వైకో నేతృత్వంలోని ఎండిఎంకె (MDMK) తో సహా ఇతర మిత్రపక్షాలకు కూడా డిఎంకె సీట్ల పంపకం చేసింది. MDMK నాలుగు స్థానాల్లో బరిలోకి దిగనుంది.