Nikhil's Swayambhu New Release Date Announced : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ లేటెస్ట్ హిస్టారికల్ ఎపిక్ 'స్వయంభు'. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తుందని తొలుత అనౌన్స్ చేశారు. అయితే, రిలీజ్ టైం దగ్గర పడుతున్నా ఇప్పటివరకూ మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు.

ఇటీవల షూటింగ్ కంప్లీట్ అయిన వీడియో తప్ప మరే అప్డేట్ టీం ఇవ్వలేదు. రీసెంట్‌గా సంక్రాంతి సందర్భంగా స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేసినా అందులో రిలీజ్ డేట్ మాయమైంది. దీంతో మూవీ రిలీజ్ వాయిదా అంటూ రూమర్స్ వినిపించాయి. ఈ క్రమంలో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

న్యూ రిలీజ్ డేట్ ఇదే...

ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 10న రిలీజ్ చేసేందుకు టీం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. మూవీకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా... సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా చేస్తున్నారు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న నిఖిల్... ఈ హిస్టారికల్ ఎపిక్‌లో పవర్ ఫుల్ వారియర్‌గా కనిపించనున్నారు.

పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ మూవీని నిర్మిస్తున్నారు. రవి బ్రసూర్ మ్యూజిక్ అందిస్తుండగా... బాహుబలి, RRR మూవీస్ ఫేం సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. చరిత్ర చూడని... చరిత్రలో చెప్పని ఓ గొప్ప వీరుడి కథే స్వయంభు అంటూ స్పెషల్ వీడియో ద్వారా హైప్ క్రియేట్ చేశారు నిఖిల్. ఈ ప్రాజెక్ట్ కోసం హీరో దాదాపు మూడేళ్ల పాటు శ్రమించారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత హిస్టారికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

Get ready for a grand cinematic experience with @actor_Nikhil's #Swayambhu . The film is hitting cinemas worldwide on April 10th, 2026. The grand scale, presentation, and #Nikhil's striking transformation are generating a huge buzz @PixelStudiosoff pic.twitter.com/pNgPh9KZvE

— BA Raju's Team (@baraju_SuperHit) January 24, 2026

Also Read : 'కాల్ ఘాట్'లో అంతు చిక్కని రహస్యం - ఇంట్రెస్టింగ్‌గా 'కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3'... థియేటర్‌లోకి క్రైమ్ థ్రిల్లర్