ప్రతీ ఏటా మాఘ శుద్ధ సప్తమి రోజున శ్రీ సూర్యనారాయణస్వామికి తొలి పూజ నిర్వహించడం, మహాక్షీరాభిషేకం స్వరూపానందేంద్రస్వామి చేతులమీదుగా జరగడం అరసవల్లి ఆలయానికి ఆనవాయితీగా మారింది. ఆయన రాకను పూర్ణకుంభంతో ఆహ్వానం పలికే ఆలయ అర్చకులు, రుత్వికులు, ఆలయ సిబ్బంది అంతా ఆయనకు పాదాభివందనాలు చేసి తోడ్కోనిపోయే రోజులు నుంచి ఆయన ఆలయ ప్రాంగణానికే రావద్దన్న స్థితికి స్వామి వారి అర్హత దిగజారిందంటే అందుకు ఆధ్యాత్మిక గురువులు, స్వామిజీలు ప్రభుత్వాలతో, అందులో గల రాజకీయ నాయకులతో సావాసాలు చేయడం, వారిని మహాయోగులుగా వర్ణించడం వంటి పొరపాట్లే అని వినిపిస్తోంది.

ఇదే స్వామి పుట్టినరోజును ఆంధ్రప్రదేశ్లో అన్నీ ఆలయాల్లో అధికారికంగా నిర్వహిం చాలంటూ జగన్ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఇక్కడ అరసవల్లి ఆలయంలో కూడా స్వరూపానందస్వామి జన్మదిన వేడుకలు అట్టహాసంగా అదుపుదాటి నిర్వహించిన అర్చకులే ఇప్పుడు ఆయనను మహాక్షీరాభిషేకానికి అనుమతించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అప్పట్లో రాష్ట్ర దేవదాయశాఖ అదనపు కమిషనర్ కె. రామచంద్రమోహన్ స్వరూపానందస్వామి జన్మదిన వేడుకలకు ఉత్తర్వులు జారీ చేసారు. కానీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అరసవల్లి ఆదిత్యుని జయంతి ఉత్సవానికి అటువంటి స్వాములను ఆహ్వానించవద్దంటూ ఎటువంటి మౌకికలిఖిత ఆదేశాలు ఇవ్వలేదు. అయినప్పటికీ, ఇక్కడ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని, పలు ఆలయాల అర్చకులు, రుత్వికుల అభిప్రాయాలను సేకరించిన స్థానిక సనాతనధర్మం పరిరక్షణ సమితి నిర్వాహకుల సూచనలు మేరకు ఈసారి రథసప్తమి ఉత్సవాలకు రాజకీయ రంగులు పులుముకునే స్వాములను ఆతిథ్యం ఇవ్వద్దంటూ కఠిన నిర్ణయం తీసుకోవడం హిందూ ధర్మ పరిరక్షణకు మంచి శకునమే.

మాజీ సీఎం జగన్ హయాంలో వివాదస్పదమైన స్వరూపానందస్వామి జన్మదిన వేడుకలు అధికారికంగా జరగడాన్ని సాధుపరిషత్ కూడా విమర్శించడం తెలిసిందే. ఆలయాలపై జులుం చేసే స్వాములు ఎవరైనా ఆధ్యాత్మక సభలకు, ప్రవచనాలకు, తొలి పూజలకు అనర్హులుగా గుర్తించాలని నాగావళి, వంశధార నదుల సంగమంలో అర్చకులు, రుత్వికులు, సనాతన ధర్మాన్ని పరిరక్షించే సంఘాలు ముక్తకంఠంతో కోరడంతో శ్రీ స్వరూపానందస్వామిని ఈ ఏడాది నుంచి హర్షవల్లిలో జరిగే సూర్యజయంతి ఉత్సవానికి, అందులో భాగంగా మహాక్షీరాభిషేకం నిర్వహించడానికి అనర్హతను ప్రకటించడం ఆధ్యాత్మిక రంగంలో చాలా అరుదైన మార్పే. గడచిన రెండు మూడు ఏళ్ళుగా శ్రీ స్వరూపానందస్వామి జగన్ ప్రభుత్వంలో ప్రత్యేక స్థానంలో ఉండడంతో ఆయన తరుఫున శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్రస్వామి అరసవల్లి రథసప్తమి రోజున హాజరయ్యేవారన్న విషయం ఇక్కడ భక్తులకు, అర్చకులకు, అధికారులకు గుర్తుఉండేవుంటుంది.

టీటీడీ ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి బాస్కర్రెడ్డి రేణిగుంట ఎయిర్పోర్టులో స్వరూపానం దేంద్రస్వామి, స్వాత్మానందేంద్రస్వామిలకు స్వాగతం పలికి అక్కడ నుంచి వారిని తిరుమలకు తీసుకువెళ్ళే సందర్భం కూడా ఇప్పుడు అరసవల్లి దేవస్థానం ఉత్సవాల నేపథ్యంలోఇక్కడ పురోహితులు, పామరులు అంతా తప్పుపట్టారు. అలాంటి అరాచకమైన రాజకీయ ప్రలోభాలకు లోనై స్వాములు మెసలడం వల్లే సనాతన ధర్మంపై వివిధ రకాలుగా అపశృతులు ఎదుర్కోంటున్నామని, హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన స్వాములు వారి పరివారంతో పనికిరాని పనులు చేయడం వల్లనే హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో చాలా అవస్థలు పడాల్సివస్తుందన్న ప్రజలు మనోభావాలన్నీ వాస్తవాలనడానికి తాజాగా రథసప్తమి ఉత్సవానికి శ్రీ శారదాపీఠాధిపతిని ఆయన పరివారం రానవసరం లేదన్న నిర్ణయానికి వచ్చారంటే అంతకంటే దుస్థితి - వేరొకటి లేదనే చెప్పాలి.

మహాక్షీరాభిషేకానికి ఎప్పుడూ మేము ఆహ్వానించలేదు - అరసవల్లి ఆలయం ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ

ప్రతీ ఏటా జరిగే ఆదిత్యుని జయంతి ఉత్సవం సందర్భంగా రథసప్తమి రోజున సూర్యదేవుడు మూల విరాట్కు మహాక్షీరాభిషేకం నిర్వహించడం పరిపాటి. అలాంటి సంపూర్ణమైన మహెూత్తరమైన ఘటనలో శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామితోపాటు మరో 20 మంది హాజరవుతామని లేఖ పంపడం, వచ్చినవారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం గౌరవించడం జరిగేదని ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ '
చెప్పారు. అంతేగానీ, ఆలయం నుంచి అర్చక బృందం కానీ, అధికారికంగా ఆలయ సిబ్బంది గానీ స్వరూపానందస్వామిని ఎప్పూడూ ప్రత్యేకంగా ఆహ్వా నించలేదంటూ శంకర శర్మ సుస్పష్టం చేశారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం శృంగేరీపీఠం నుంచి శంకరాచార్యులు వారి పరివారం సూర్యదేవుడు ఆలయానికి వచ్చినట్టు అయితే వారిని పూర్తి బాధ్యతగా సత్కరించడం, పలు సందర్భాల్లో మహా సూర్యయాగం చేసే నేపథ్యంలో అటువంటి మహాస్వాములను ఆహ్వానించడం జరిగిందని చెప్పారు.