Suriya 45: 'సూర్య45'లో హీరోయిన్‌గా త్రిష... 20 ఏళ్ల తరువాత మరోసారి జంటగా!
11 months ago 7
ARTICLE AD
దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య, త్రిష కలిసి నటించబోతున్నారు. ఈ విషయంపై తాజాగా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేసింది. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి త్రిష 22 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా... డైరెక్టర్ ఆర్జే బాలాజీ స్పెషల్ గా విష్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇండస్ట్రీలో 22 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రిష
సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున త్రిష సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ను మొదలు పెట్టింది. ఇండస్ట్రీలో 22 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా త్రిషకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. డిసెంబర్ 13న త్రిష ప్రారంభించింది. అయితే 2002లో సరిగ్గా డిసెంబర్ 13న సూర్య హీరోగా నటించిన 'మౌనం పెసియాదే' సినిమాలో మొట్టమొదటిసారి త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సందర్భంగా త్రిష సోషల్ మీడియాలో తాను సాధించిన ఈ మైలురాయి గురించి స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. "22 ఏళ్లుగా సినిమా అనే మాయాజాలంలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు" అంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక ఈ 20 ఏళ్లలో త్రిష సౌత్ స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నా కూడా ఇప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుండడం విశేషం.
20 ఏళ్ల తరువాత మరోసారి జోడిగా...
అయితే సరిగ్గా త్రిష సినిమా ఇండస్ట్రీలో 22 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఇన్నేళ్ల తరువాత మరోసారి ఆమె సూర్యతో జోడి కట్టబోతోందని వార్తలు వచ్చాయి. 'కంగువ' సినిమా డిజాస్టర్ అయిన తర్వాత సూర్య తన 45వ సినిమాపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష 22 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్జే బాలాజీ సోషల్ మీడియాలో ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. "23వ ఏడాదిని సూర్య 45తో స్టార్ట్ చేద్దాం" అంటూ విష్ చేశారు. దీంతో 'సూర్య 45' సినిమాలో త్రిష ఎంట్రీ అఫిషియల్ గా అనౌన్స్ చేసినట్టుగా అయ్యింది.
Congratulations on 22 glorious years @trishtrashers ⭐️ And we are elated to start the 23rd year with #Suriya45 🔥 pic.twitter.com/fDkbbDqAbS
— RJ Balaji (@RJ_Balaji) December 13, 2024
'సూర్య 45' షూటింగ్ ఫోటోలు లీక్
'సూర్య 45' సినిమాలో సూర్య, త్రిష కలిసి నటిస్తున్నారు అనే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికంటే ముందే లీక్ అయ్యింది. 'సూర్య 45' సెట్స్ నుంచి లీకైన పిక్స్ లో త్రిష లాయర్ గా కనిపించింది. అప్పటి నుంచి 'సూర్య 45' సినిమాలో త్రిష - సూర్య కలిసి నటించబోతున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. కానీ ఈ మూవీలో త్రిష కేవలం అతిథి పాత్రను పోషిస్తుందా ? లేదంటే హీరోయిన్ గా నటిస్తోందా ? అనేది తెలియాల్సి ఉంది.
త్రిష అప్ కమింగ్ ప్రాజెక్ట్స్
Read Also : Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
Read Entire Article