Supreme Court Recruitment: పదో తరగతి అర్హతతో, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం లభించింది. సుప్రీంకోర్టులో 130 జూనియర్ కోర్ట్ అటెండెంట్ (గ్రూప్-సి, నాన్-క్లరికల్) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ : నవంబర్ 4

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 25 (రాత్రి 11:55 గంటల వరకు)

రాత పరీక్ష : డిసెంబర్ 26

అర్హతలు

ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 10వ తరగతి లేదా 12వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

అక్టోబర్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

అభ్యర్థుల సెలక్షన్‌లో మొదటగా డిసెంబర్ 26, 2026న ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష నిర్వహించబడుతుంది. రాత పరీక్షలో అర్హతన సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ రెండింటిలో సాధించిన మేరిట్ ఆధారంగా ఫైనల్ అభ్యర్థుల లిస్ట్ ఉంటుంది.

Also Read:  నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల

ఎలా అప్లై చేసుకోవాలి?

అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 4 నుండి సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. గడువు ముగిసే వరకు చూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్