Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు

3 months ago 7
ARTICLE AD
<p>న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ ఆందోళన విషయంలో విద్యార్థులకు భారీ ఊరట లభించింది. నేర చరిత్ర లేని విద్యార్థులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్యార్థులను తక్షణం విడుదల చేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఘటనలపై సీసీటీవీ ఫుటేజీ వీడియోలను సమర్పించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు విద్యార్థులకు ఊరట కలిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.</p> <p><strong>ఆందోళన చేసిన విద్యార్థులకు నేర చరిత్ర.. కొందరిపై హత్యాయత్నం కేసులు</strong></p> <p>ఆందోళనల్లో పాల్గొన్న 3000 మంది విద్యార్థులలో 101 మందికి నేర చరిత్ర ఉంది, వారిలో 62 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. విద్యార్థులు, సీజేపీ ఆందోళనలో దాదాపు 200 మంది పోలీసులు గాయపడ్డారని, ఇది సాధారణ విషయం కాదని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు.&nbsp;</p>
Read Entire Article