India Sugar Daddy Capital : ప్రపంచంలో మానవ సంబంధాలు మారిపోతున్నాయి. ఈ క్రమంలో ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్న అంశం సుగర్ డేటింగ్. భావోద్వేగ అనుబంధం కాకుండా పరస్పర ప్రయోజనాలపై దృష్టి పెట్టి ఏర్పాటు చేసుకునే బంధాన్ని సుగర్ డేటింగ్ గా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం శృంగారం, స్నేహం అందించే బంధం సుగర్ డేటింగ్. ఇలా డబ్బుల కోసం ఓ బంధాన్ని ఏర్పరుచుకునేవారిని సుగర్ డాడీలు అంటున్నారు. "సుగర్ డాడీ" అనే పదం మధుమేహంతో ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి సుగర్ డాడీలు భారత్ లో అత్యధికంగా ఉన్నారని ఓ సర్వేవెల్లడించింది. భారత్‌లో మొత్తం 338,000 మంది సుగర్ డాడీలు ఉన్నారని సర్వే వెల్లడించింది. రెండవ స్థానంలో ఇండోనేషియా, మూడవ స్థానంలో మలేషియా ఉంది.

ఒక వ్యక్తికి స్నేహం, శృంగారం, ఇతర సేవల్ని అందించడం ద్వారా ఆర్థిక మద్దతు పొందతారు. సాధారణంగా ఆర్థికంగా బాగున్న వ్యక్తి వయసు పెద్దవాడు కాగా, యువ వ్యక్తి తన జీవనశైలి మెరుగుపరచుకోవాలని అతనికి స్నేహితుడుగా మారుతాడు. సుగర్ డేటింగ్ అంటే ఒక పెద్ద వ్యక్తి యువతులకు మహిళకు బహుమతులు ఇచ్చి శృంగార సుఖం పొందడం మాత్రమే కాదు. వివిధ రకాల సుగర్ సంబంధాలు ఉన్నాయి

ప్లాటానిక్ సుగర్ స్నేహాలు అనేది మొదటి రకం. ఇందులో శృంగారం ఉండదు. ఇది కేవలం స్నేహం ఆధారంగా ఉంటుంది, ఇందులో సుగర్ డాడీ ఆర్థిక సాయం చేస్తారు. భత్యం చెల్లించే డేటింగ్ రెండో రకం. ఇది చాలా ఆసియా దేశాలలో ప్రాచుర్యం పొందిన రకం. ది ఓ రకంగా ఎస్కార్ట్ సర్వీస్ లాంటిది. ఎలాంటి శృంగార సర్వీసులుఉండవు. మూడో రకం సుగర్ డేటింగ్ ..ఇందులో స్నేహం, శృంగారం అన్నీ కలిసి ఉంటాయి. నాలుగో రకం బెనిఫిట్స్ ఉన్న సుగర్ స్నేహాలు అని చెప్పుకోవచ్చు. ఈ రకం సుగర్ డేటింగ్ మరింత సడలింపు ఉంది.ఇందులో సుగర్ డాడీ అన్నీ ఖర్చులు భరిస్తాడు కానీ.. అన్ని రకాల సంబంధాలు పెట్టుకోవాలని లేదు.

సాధారణంగా సుగర్ డాడీ సంబంధం అనేదిధనవంతుడైన పురుషుడు, యువ మహిళకు డబ్బులు ఇచ్చి సంబంధాలు పెట్టుకునేవారని అనుకంటారు. వాస్తవానికి ఈ సంబంధాలు చాలా వైవిధ్యమైనవి. రతదేశం అగ్రస్థానంలో ఉన్న నేపథ్యంలో సుగర్ డేటింగ్ మరింత వివిధ రకాలుగా మారిపోయింది. ఇందులో కేవలం శృంగారం అనే భావన ఉండదు. ఇప్పుడు శృంగారం కన్నా..ఇతర భావోద్వేగ అంశాలపైనే ప్రజలు ఎక్కువగా స్పందిస్తున్నారు. బాగా డబ్బులు సంపాదించి ఖాళీగా ఉన్న వారు.. మానసిక ఉల్లాసం కోసం.. సుగర్ డాడీలుగా మారుతున్నారు. డబ్బులు ఇచ్చి తమతో స్నేహం చేసే వారి కోసం చూసుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య భారత్ లో ఎవరూ ఊహించని విధంగా పెరుగుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Also Read : Dunki Route : ‘డంకీ రూట్’ మార్గం గుండా అమెరికాలోకి అక్రమ వలసలు- ఆ 97 కి.మి.లు నరకమే