AP government decides to hand over Sugali Preethi case to CBI: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని నిర్ణయించింది. సుగాలి ప్రతీ తల్లి తమకు న్యాయం చేస్తామని పవన్ కల్యామ్ కూడా పట్టించుకోలేదని ఆరోపిస్తూ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఈ కారణంగా కేసును సీబీఐకి సిఫారసు చేయాలని నిర్ణయించారు.నాలుగో తేదీన జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని కేంద్ర హోంశాఖకు పంపుతారు. నిజానికి ఈ కేసును వైసీపీ ప్రభుత్వంలోనూ సీబీఐకి అప్పగిస్తూ సిఫారసు చేశారు. కానీ తమకు వనరుల్లేవని సీబీఐ వాదించింది. దాంతో కేసు సీబీఐకి వెళ్లలేదు.

సుగాలి ప్రీతి కర్నూల్ జిల్లాకు చెందిన రాజు నాయక్ , పార్వతి దేవి దంపతుల కుమార్తె. 2017 ఆగస్టు 19న కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ స్కూల్ ప్రాంగణంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్కూల్ యాజమాన్యం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఆమెను అత్యాచారం, హత్య చేశారని ఆరోపించారు. వారు స్కూల్ యజమాని కుమారులపై ఆరోపణలు చేశారు. ఆరోపణలు ఎదుర్కొన్న వారిని అరెస్టు చేశారు. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. 2018లో, ప్రీతి తల్లిదండ్రులు స్థానిక పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆరోపిస్తూ సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేశారు. సీబీఐ గతంలో వనరుల కొరత కారణంగా కేసును తీసుకోలేనని హైకోర్టుకు తెలిపింది. అప్పట్లో రాష్ట్రం సీబీఐకి జనరల్ కన్సెంట్ ఇవ్వలేదు. ఆ సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ సమస్యలు ఏమీ లేకపోవడంతో కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండటంతో సుగాలి ప్రీతి కేసును సీబీఐ హ్యాండిల్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి ఆరోపణలు

ఎన్నికల్లో గెలిచాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్ గాలికొదిలేశారని.. మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్‍పై చేస్తామని పవన్ చెప్పారన్నారు. 14 నెలలైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. నా కూతురికి న్యాయం చేయలేకపోతున్నారని ఇటీవల ప్రెస్మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. - జనసేన కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు. సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై డిజిటల్ క్యాంపెయిన్ చేస్తానన్నారు. ఇప్పటికైనా సుగాలి ప్రీతి మృతిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

ఆ తర్వాత కల్యాణ్ స్పందించారు. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో నా పరిస్థితి పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న చందంగా తయారైంది. చేయూతనిచ్చిన వారినే తిడితే ఎలా? ఆ తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కర్నూలు నడిబొడ్డున గళం విప్పాం. ఆ పోరాట ఫలితంగా ఆ కేసును సి.బి.ఐ.కి అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. లెటర్ ఇచ్చి లాకర్‌లో పెట్టింది. నేను ఉపముఖ్యమంత్రి అయ్యాక సుగాలి ప్రీతి కేసుపై సీఐడీ చీఫ్‌తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించాను. డీజీపీతో,హోంమంత్రితో మాట్లాడాను. సీఐడీ విచారణ చేపట్టిన తర్వాత తేలిన అంశం ఏంటంటే అనుమానితుల డీఎన్ఏలు సరిపోలడం లేదు. సాక్ష్యాలు తారుమారు చేశారని అన్నారు.

పవన్ వివరణ ఇచ్చిన తర్వాత వైసీపీ నేతలతో కలసి సుగాలి ప్రతీ ప్రెస్మీట్లు పెట్టి విమర్శలు చేస్తూండటంతో. ప్రభుత్వం సీబీఐకి ఇవ్వాలని నిర్ణయించుకుంది.