Sudigali Sudheer Rashmi: రష్మితో పెళ్లి చేసేయమంటున్న సుధీర్... 'పుష్పరాజ్'గా హైపర్ ఆది... కామెడీతో రచ్చ రచ్చే
10 months ago 8
ARTICLE AD
జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), యాంకర్ రష్మీ (Rashmi Gautam)ల మధ్య లవ్ ట్రాక్ బుల్లితెర ఆడియన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ నిజమేమో అనిపించే రేంజ్ లో ఉంటుంది. అందుకే తామిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమే అని వీరిద్దరూ ఎన్నిసార్లు చెప్పినా, సుధీర్ - రష్మీ లవ్ ట్రాక్ గురించిన వార్తలు, పుకార్లు ఆగడం లేదు. తాజాగా మరోసారి సుడిగాలి సుధీర్ తనకు రష్మితో పెళ్లి చేసేయమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
హైపర్ ఆది హిలేరియస్ పంచ్ లు
ఈటీవీలో 'ఈ సంక్రాంతికి వస్తున్నాం' అనే పేరుతో సంక్రాంతి సందర్భంగా ఒక స్పెషల్ షోని ప్లాన్ చేశారు. జనవరి 14న టెలివిజన్లో ప్రసారం కాబోతున్న ఈ షోకి సంబంధించిన ప్రోమోని తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో శేఖర్ మాస్టర్ - పూర్ణ జంటగా ఎంట్రీ ఇచ్చారు. పూర్ణ "చూసావా ఊరంతా ఎంత అందంగా ఉందో?" అని చెప్పగా... శేఖర్ మాస్టర్ "నీ అందం ముందు అంతా తక్కువే పూర్ణ" అని పంచ్ వేశారు. దీంతో పూర్ణ తెగ సిగ్గు పడింది. ఇక ఆ తర్వాత హైపర్ ఆది "నీ జీవితంలో నా విలువెంతే అని?" అడగ్గా, ఆయన భార్యగా నటించిన నటి "కోట్ల విలువ ఉంటుంది" అని సమాధానం చెప్పింది. వెంటనే హైపర్ ఆది "అందులో నుంచి ఒక 10,000 తీసి ఇవ్వవే... కోడిపందాలు ఆడుకుంటాం" అంటూ హిలేరియస్ పంచ్ వేశాడు. ఇక ఈ షోలో రష్మీ, సుధీర్ మధ్య లవ్ ట్రాక్, అలాగే హైపర్ ఆది వేసిన పుష్ప స్కిట్ హైలైట్ గా నిలిచాయి.
"రష్మితో పెళ్లి చేసేయండి" అంటున్న సుధీర్
రష్మీ గౌతమ్ "హాయ్ బావా" అంటూ శేఖర్ మాస్టర్ ను పలకరించగా... "శేఖర్ మాస్టర్ నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం రష్మీ" అని బాంబు పేల్చారు. "అయినా ఇప్పుడు పెళ్లి ఏంటి బావ?" అంటూ రష్మీ ప్రశ్నించింది. వెంటనే హైపర్ ఆది అందుకుని "ఎవరినైనా ప్రేమించావా ఏంటి?" అని అడిగాడు. రష్మీ "ప్రేమించాను" అని సమాధానం చెప్పింది. వెంటనే హైపర్ ఆది "ఎవరో ఆ దరిద్రుడు?" అని అడగ్గా... అదే టైంలో సుడిగాలి సుధీర్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. "వచ్చి ఇంత సేపు అయ్యింది. నీ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడవా?" అని అడిగాడు ఆటో రాంప్రసాద్. వెంటనే సుడిగాలి సుధీర్ మరో అమ్మాయి దగ్గరికి వెళ్లి "తను లేకుండా నేను బ్రతకలేను" అని చెప్పాడు. అయితే ఆటో రాంప్రసాద్ "నేనెవరితో బ్రతకాలి? అది నా పెళ్ళాం "అని పంచ్ వేయగా, ఆమెను చూసి షాక్ అయ్యాడు సుధీర్.
Also Read: ఈటీవీలో కొత్త సీరియల్... 'ఝాన్సీ' టెలికాస్ట్ టైమింగ్ నుంచి యాక్టర్స్ వరకు - ఈ డీటెయిల్స్ తెలుసా?
తరువాత "నా బంగారం" అంటూ సుధీర్ పై తెగ ప్రేమను కురిపించింది రష్మి. "తనంటే నా ప్రాణం. తను లేకుండా నేను బ్రతకలేను. తనకి, నాకు పెళ్లి చేసేయండి" అనే డైలాగ్ వేశాడు సుధీర్. "ఎన్నిసార్లు చెప్తావ్ ఈ డైలాగ్ ?" అని శేఖర్ మాస్టర్ అడగ్గా.. సుధీర్ "నాకు అదొక్కటే డైలాగ్ ఇచ్చారు" అని నవ్వులు పూయించాడు. చాలాకాలం తర్వాత సుధీర్ - రష్మీ గౌతమ్ ల జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్ మరోసారి ఈ షోలో రిపీట్ అవుతుండడంతో ఆసక్తికరంగా మారింది. ఇక ఆ తర్వాత ప్రోమోలో హైపర్ ఆది పవర్ ప్యాక్డ్ 'పుష్ప 2' స్కిట్ హైలైట్ గా మారింది. మొత్తం పుష్ప సినిమానే దించేశాడు హైపర్ ఆది. ఇక ఈ షోని కంప్లీట్ గా చూడాలంటే జనవరి 14 వరకు వెయిట్ చేయాల్సిందే.
Read Entire Article