Strait of Hormuz: హర్మోజ్ జలసంధి గురించి 500 ఏళ్ల కిందటే శ్రీ కృష్ణ దేవరాయలు ఏం రాశారో తెలుసా !

1 month ago 6
ARTICLE AD

ప్రస్తుతం ప్రపంచాన్ని ఇబ్బందిపెడుతున్న ఇరాన్ -అమెరికా యుద్ధం లో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న హర్మోజ్ జలసంధి గురించి విజయనగర చక్రవర్తి 500 ఏళ్ల ముందే స్వయంగా తన కావ్యం లో వర్ణించారని చాలా మందికి తెలియదు. ఇప్పుడంటే ఇరాన్ నుండి ఎగుమతి అయ్యే ఆయిల్  ఈ హార్మోజ్ జలసంధి నుండే ఇతర దేశాలకు వెళుతోంది. కానీ ఒకప్పుడు ఈ దారిగుండా ఎగుమతి అయ్యే వస్తువులు వేరే. అంతే కాదు అత్యంత మేలు జాతి గుర్రాలు నౌకల ద్వారా ఇతర రాజ్యాలకు వెళుతూ ఉండేవి. అప్పట్లో ఇరాన్ పేరు పర్షియా. పర్షియా నుండి మేలు జాతి గుర్రాలు వచ్చేవి అని శ్రీనాధుడు, శ్రీ కృష్ణ దేవరాయలు లాంటి మహామహులు తమ తమ కావ్యాల్లో వర్ణించారు.

అప్పట్లో "హరుమాంజి' గా పిలుచుకున్న హర్మోజ్

" హరుమాంజిక్రము లైదు నెయ్యెడల నొయ్యారంబు మీఱంగ ముం
దిరముం జూచుచు నీరు గాలి గరముం దెల్లంబుగా నుర్వి నె
ట్టెఱుఁగం జూపక యారొ యీరొ యనఁగా డేఁగల్ విమానంబు లం
బరవీథిం జనెడుం దదేక గతి నుత్పాతాభముల్ వ్రేల్మిడిన్."

ఇది "హరుమాంజి " నుండి వచ్చే మేలు జాతి గుర్రాల గురించి రాయల వారు వర్ణించిన పద్యం.

పద్య భావం:
ఈ పద్యంలో కృష్ణదేవరాయలు తన సైన్యంలోని పర్షియా, అరేబియా గుర్రాల (హరుమాంజి) వేగాన్ని వర్ణించారు. ఆ గుర్రాలు ఎంత వేగంగా వెళ్తాయంటే, అవి భూమిని తాకుతున్నాయో లేదో కూడా తెలియనంత వేగంగా, ఆకాశంలో డేగలు  ఎగిరినంత వేగంగా పరుగెత్తుతాయని రాయలు వర్ణించారు.

అలాగే ఆముక్త మాల్యద లోనే మరోచోట అంటే  "ఖాండిక్య కేశిధ్వజుల సంవాదం" సందర్బంగా  శ్రీకృష్ణదేవరాయలు రాజు ఎలా రాజ్యం పాలించాలో వివరిస్తూ, సైనిక బలం కోసం మంచి గుర్రాలు, ఏనుగులు దిగుమతి చేసుకోవాలని సూచిస్తారు. హురుమంజి (హార్మోజ్) నుండి వచ్చే అశ్వాలు (గుర్రాలు) అత్యుత్తమమైనవని, వాటిని శత్రువులకు దక్కకుండా తమ రేవులు (మోటుపల్లి, మచిలీపట్నం వంటివి) అభివృద్ధి చేసి దిగుమతి చేసుకోవాలని రాజనీతి సలహా ఇస్తారు.
ఇది ప్రత్యక్ష పద్యంగా కాకుండా, రాజనీతి సలహా భాగంలో వచ్చే వచనం/పద్య సందర్భం.

శ్రీ నాథ కవి సార్వభౌముడి కావ్యాల్లోనూ హర్మూజ్ ప్రస్తావన

శ్రీ కృష్ణ దేవరాయల కంటే ముందు శ్రీ నాధుడు (1355-1441 CE ) కూడా తన రచనల్లో "హరుమాంజి"  రేవు గురించి ప్రస్తావించారు. తన "
'హర విలాసం ' కావ్యం లో
అవచి తిప్పయ్య సెట్టి అనే  వర్తకుడి గురించి వర్ణిస్తూ, అతను ఏయే దేశాల నుండి వస్తువులు తెచ్చేవాడో తెలిపే  పద్యంలో "హురుమంజి" (హార్మోజ్) ప్రస్తావన చేసాడు.  అత్యంత వేగవంతమైన, అందమైన గుర్రాలను (హురుమంజి సొగసు కైవడి బారువారముల్) తెప్పించేవారని ఆయన తెలిపాడు. దీనవల్ల హార్మోజ్ నుండి కేవలం గుర్రాలే కాకుండా, ముత్యాలు, పన్నీరు, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, ముఖమల్ వస్త్రాలు వంటి విలాసవంతమైన వస్తువులు కూడా దిగుమతి అయ్యేవని తెలుస్తోంది.

శ్రీకృష్ణ దేవరాయలు "హరుమాంజి " నుండి గుర్రాలు ఎందుకు కొనేవారు .?

శ్రీ కృష్ణ దేవరాయల (1509-1529 CE ) కాలానికి ఉత్తర భారత దేశం లో "లోడి" రాజుల పాలన నడుస్తోంది. బాబర్ కూడా ' ఫెర్గానా ' నుండి ఢిల్లీ ఫై దాడి చెయ్యడానికి రెడీ అవుతున్నసమయం అది. కాబట్టి ఇరాన్ వ్యాపారులు ఆ భూభాగం ద్వారా దక్షిణాదికి వచ్చి హంపి తో వ్యాపారం చేసే పరిస్థితి లేదు. నౌకల ద్వారానే విజయనగరం చేరుకోవాలి. మరో వైపు విజయనగర సామ్రాజ్యం చుట్టూ ఉన్న బహామనీ రాజ్యం 5 ముక్కలుగా విడిపోయి గోల్కొండ, అహ్మద్ నగర్, బీరార్, బీజపూర్, బీదర్ రాజ్యాలు గా ఏర్పడ్డాయి. వీరిని అదుపులో పెట్టడానికి తమ సైన్యాన్ని మరింత బలోపేతం చెయ్యడానికి విజయనగర చక్రవర్తులు పర్షియా, అరేబియా ప్రాంతాల నుండి మేలు జాతి గుర్రాలను కొనేవారు.

శ్రీ కృష్ణ దేవరాయల నుండి లభించే ధనం చాలా ఎక్కువ కావడం తో పర్షియన్ వ్యాపారులు కూడా తమ గుర్రాలను ఆయనకే అమ్మడానికి మొగ్గు చూపేవారు.ఆ వ్యాపారం మొత్తం "హరుమాంజి " జల సంధి ద్వారానే జరిగేది. దాని గురించే శ్రీ కృష్ణ దేవరాయలు తన 'ఆముక్త మాల్యద ' కావ్యం లో వర్ణించారు. ఏదేమైనా ప్రస్తుతం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోన్న "హార్మోజ్ " జలసంధి గురించిన ప్రస్తావన అక్కడి నుండి మనదేశానికి జరిగిన వ్యాపారాల గురించిన ప్రస్తావన 700 ఏళ్ల క్రితం నాటి తెలుగు కావ్యాల్లో ఉండడం చరిత్రకారులను, సాహిత్య వేత్తలను అబ్బురపరుస్తోంది.

Read Entire Article