Stomach Upset : కడుపు సమస్యలతో బాధపడుతున్నారా? కారణాలు ఇవే.. ఆ సమయంలో తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్

2 months ago 6
ARTICLE AD

Causes of Stomach Upset and the Right Diet : ఈ రోజుల్లో చాలా మందికి తరచుగా కడుపు సమస్యలు వస్తున్నాయి. దీనికి చాలా ప్రధాన కారణాలు ఉన్నాయి. ఆ సమయంలో వాంతులు, విరేచనాలు కావడం, కళ్లు తిరగడం, ఓపిక లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అసలు ఈ సమస్యలకు కారణం ఏంటి? కడుపులో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్స్​కి దూరంగా ఉండాలి? ఎలాంటి ఆహారం తీసుకుంటే త్వరగా రికవరీ అవుతారో తెలుసుకుందాం.

కడుపు సమస్యలకు కారణాలు..

సాధారణంగా Stomach Upset అవ్వడానికి చాలా సాధారణమైన కారణం.. స్ట్రీట్ ఫుడ్. రోడ్డు పక్కన దొరికే ఆహారం.. సరిగ్గా ఉడకని పదార్థాలు కడుపును తర్వగా చెడగొడతాయి. అలాగే సమయానికి భోజనం చేయకపోవడం, అధికంగా తినవడం వల్ల కూడా ఇవి వస్తాయి. కలుష్యమైన నీరు, ఆహారం వల్ల కూడా స్టమక్ ఇన్​ఫెక్షన్ వస్తుంది. స్ట్రెస్, టెన్షన్ కూడా కడుపు నొప్పికి కారణమే అంటున్నారు వైద్యులు. పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడినా కూడా కడుపు సమస్యలు వస్తాయట.

కడుపు సమస్యలు ఉన్నప్పుడు తినాల్సిన ఫుడ్స్ ఇవే

ఇలా జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు లైట్ ఫుడ్ తీసుకోవాలి. సులభంగా డైజెస్ట్ అయ్యే కంఫర్ట్ ఫుడ్ తీసుకోవాలని చెప్తున్నారు. అలాంటి వాటిలో అన్నం, మజ్జిగా ఒకటి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పొటాషియం అధికంగా ఉండే అరటి పండ్లు కడుపును చల్లబరుస్తాయి. కాబట్టి ఇది కూడా కంఫర్ట్ ఫుడ్. అలాగే క్యారెట్, గుమ్మడికాయలతో చేసిన సూప్ తీసుకోవచ్చు. పెరుగు కూడా కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. కొబ్బరి నీళ్లు డీహైడ్రేషన్ కాకుండా హెల్ప్ చేస్తాయి. కాబట్టి స్టమక్ అప్​సెట్ అయినప్పుడు ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉంటారు.

తినకూడని ఫుడ్స్ ఇవే..

కడుపు చెడినప్పుడు మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. కొన్ని ఫుడ్స్​కి దూరంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. మసాలా, నూనెతో చేసిన ఫ్రైడ్ ఫుడ్స్, కారంగా ఉండే ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్లకూడదు. పిజ్జా, బర్గర్, నూడుల్స్ తీసుకోకూడదు. పాలతో చేసిన స్వీట్స్​ తీసుకున్నా కడుపు ఇబ్బంది పడుతుంది. కాఫీ, ఆల్కాహాల్ గ్యాస్, ఎసిడిటీని పెంచుతాయి. కార్బోనేటెడ్ డ్రింక్స్ గ్యాస్ సమస్యను పెంచుతుంది. కాబట్టి ఈ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలి.

వెంటనే రిలీఫ్ కావాలంటే ఏమి చేయాలంటే..

కడుపు సమస్యలు ఉన్నప్పుడు నీరు ఎక్కువగా తాగాలి. తేలికపాటి ఆహారం, సరైన విశ్రాంతి తీసుకుంటే.. తొందరగా కోలుకోగలుగుతారు. సమస్య ఎక్కువ రోజులు ఉంటే వెంటనే వైద్యుని సహాయం తీసుకోవాలి. ఆలస్యం చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Read Entire Article