Stock Market Crash: ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏంటోగానీ స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోయిందని ఇన్వెస్టర్లు గగ్గోలు పెడుతున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన బడ్జెట్‌ 2026-27కు ముందు జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌లో భారత స్టాక్ మార్కెట్ ఫ్లాట్ గా ప్రారంభమైంది. నిఫ్టీ 50 సూచీ 25,333.75 వద్ద ప్రారంభం కాగా, ఇది 13.10 పాయింట్లు లేదా 0.05 శాతం స్వల్పంగా పెరిగింది. అయితే, BSE సెన్సెక్స్ 82,445.97 వద్ద ప్రారంభమైంది, ఇది 176.19 పాయింట్లు లేదా 0.21 శాతం పెరిగింది.

సెన్సెక్స్ 2 వేల పాయింట్లకు పైగా డౌన్

నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి ఆయా రంగాలకు కేటాయింపులు ప్రకటిస్తున్న సమయంలో ఓ దశలో సెన్సెక్స్ 2300 పాయింట్లు పతనమైంది. అనంతరం 1800 పాయింట్లు అనంతరం రికవర్ అయి 1500 పాయింట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఓ దశలో నిఫ్టీ సైతం గరిష్టంగా 500 పాయింట్లు నష్టపోవడం ఇన్వెస్టర్లకు పీడకలను మిగిల్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కాస్త ముందు పరవాలేదనిపించిన సెన్సెక్స్, నిఫ్టీలు ఆ తరువాత భారీగా పడిపోయియాయి. దాంతో స్టాక్ మార్కెట్ స్పెషల్ ట్రేడిండ్ సెషన్ ఉన్నా లక్షల కోట్లలో ఇన్వెస్టర్ల డబ్బు నీళ్లలా కరిగిపోయింది. ట్రేడింగ్ సెషన్ ముగిసేవరకు సెన్సెక్స్, నిఫ్టీలు కోలుకుని ఊరట కలిగిస్తాయని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు.