Stock Market India Today: భారత స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను అధిగమించి బుధవారం బాగా పుంజుకుంది, ప్రపంచ పరిణామాలపై కొత్త ఆశలతో దలాల్ స్ట్రీట్‌లో బెంచ్ మార్క్ సూచీలు లాభాలను నమోదు చేశాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపించడంతో పెట్టుబడిదారులను మళ్లీ మార్కెట్‌లో ఆసక్తి చూపడంతో భారీ ర్యాలీ వచ్చింది. అయితే, ఈ ఇరాన్, అమెరికా యుద్ధ మేఘాలు నిజంగానే తొలగిపోతాయా అనే అనుమానాలు సైతం కొనసాగుతున్నాయి.

భారత ఈక్విటీలు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న రెండు రోజుల నష్టాల నుండి కోలుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 2,000 పాయింట్లకు పైగా పెరిగింది. దాంతో పాటు నిఫ్టీ ప్రారంభ ట్రేడింగ్‌లో 2.7% కంటే ఎక్కువ పుంజుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు త్వరలో తగ్గుతాయని ఇరువైపుల నుంచి సంకేతాలు రావడంతో భారత స్టాక్ మార్కెట్లో మళ్లీ లాభాల బాట పడుతోంది. బుధవారం మార్కెట్లో బీఎస్‌ఈకి చెందిన సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు చెందిన నిఫ్టీ 50 రికవరీ అవుతున్నాయి.

ఇరాన్‌పై సైనిక చర్య రెండు మూడు వారాల్లో ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిగ్నల్ ఇవ్వడంతో ఇన్వెస్టర్లలో ఆశలు చిగురిస్తున్నాయి. ఉద్రిక్తత త్వరలో తొలగిపోతుందని, పెట్టుబడులకు ఏ ఇబ్బంది లేదని నమ్మకం రావడంతో ఇన్వెస్టర్లు కం బ్యాక్ చేయడం ప్రపంచ స్టాక్ మార్కెట్లలో కనిపిస్తోంది. మరోవైపు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర దాదాపు $105కి పడిపోయింది. ఓవరాల్‌గా ఆసియా ఈక్విటీలు ర్యాలీ అవుతున్నాయి.

ఈ ర్యాలీకి ప్రధాన కారణం ఏంటీ..

స్టాక్ మార్కెట్లో నేటి ర్యాలీకి మరో ప్రధాన కారణం ఇటీవల కరెక్షన్ తర్వాత పెట్టుబడిదారులు మళ్లీ ఈక్విటీలతో ఇతరత్రా విభాగాల్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇటీవల భారీగా పడిపోయిన రంగాలలో ఇన్వెస్ట్ చేయడం సూచీలు పైపైకి వెళ్తున్నాయి. కేవలం కొన్ని విభాగాల్లో క్షీణత కనిపించగా, వేలాది స్టాక్‌లు నష్టాల నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. మిడ్-క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్‌లు 3% కంటే ఎక్కువ లాభాలతో బెంచ్‌మార్క్‌లను దాటడం విశేషం. పెద్ద స్టాక్‌లతో పాటు చిన్న స్టాక్స్ సైతం మంచి ధరలకు ర్యాలీ అవుతుండటం వారిలో యుద్ధ భయాన్ని పోగొట్టిందని సూచిస్తున్నాయి.

తగ్గుతున్న అస్థిరత, కానీ జాగ్రత్త అవసరం

మార్కెట్ అస్థిరతకు సంబంధించిన కీలకంగా భావించే ఇండియా VIX ఇండియా సూచీ 10% తగ్గి దాదాపు 25కి చేరుకుంది. తక్కువ అస్థిరత స్వల్పకాలంలో పెట్టుబడిదారుల విశ్వాసంతో పాటు పెట్టుబడుల్లో స్థిరత్వాన్ని పెంచుతుంది. ప్రస్తుతం ఎంత పుంజుకున్నా ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

పెట్టుబడిదారులు ప్రస్తుం ఏం చూడాలి

ప్రస్తుత ర్యాలీ ఊరట కలిగిస్తున్నప్పటికీ, పూర్తి స్థాయి రికవరీ ఫేజ్ అనుకోవడం తొందరపాటు కావచ్చు. పశ్చిమాసియాలో పరిస్థితులు ఇంకా సర్దుబాటు కాలేదని గుర్తుంచుకుని ఇన్వెస్ట్ చేయాలి. మరికొన్ని రోజులు ఆచితూచి వ్యవహరించాలని చెబుతున్నారు. ఉద్రిక్తత తగ్గితేనే ముడి చమురు ధరలు స్థిరంగా ఉంటాయి, ఇంకా పడిపోతాయి. పలు రంగాలపై ఒత్తిడి తగ్గి మార్కెట్‌కు మళ్లీ బూమ్ వస్తుంది. .

దీర్ఘకాలిక పెట్టుబడిదారులు స్ట్రాంగ్ స్టాక్‌లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బ్యాంకింగ్ వంటి రంగాలలో భారీగా కరెక్షన్ కనిపిస్తోంది. అవకాశం వచ్చినట్లు కనిపించినా, ఫైనాన్షియల్ డిసిప్లిన్ మరికొన్ని రోజులు ఉండాలని సూచిస్తున్నారు.