370 Rupees Biryani Joke Controversy: సోషల్ మీడియా యుగంలో నోరు జారితే ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో చెప్పడానికి గురుగ్రామ్‌కు చెందిన ఒక యువ టెక్కీ ఉదంతమే తాజా ఉదాహరణ. ప్రముఖ స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే నిర్వహించిన ఒక లైవ్ 'క్రౌడ్-వర్క్' షోలో, హిమాన్షు జంగ్రా అనే వెబ్ డెవలపర్ సరదా కోసం చేసిన ఒక వ్యాఖ్య అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. తాను కేవలం రూ. 370 ఖర్చు పెట్టి తినిపించిన చికెన్ బిర్యానీకి ప్రతిఫలంగా.. డేటింగ్‌కు వచ్చిన మహిళపై లైంగిక హక్కును ఆశించినట్లు చేసిన ఆ వ్యాఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, నెటిజన్ల ఆగ్రహానికి దారితీసింది.

అసలు ఏం జరిగిందంటే..?

'క్రౌడ్-వర్క్' కామెడీ షోలో కమెడియన్ అడిగిన ప్రశ్నకు హిమాన్షు సమాధానమిస్తూ.. తాను ఇటీవల తనకంటే వయసులో కాస్త పెద్దదైన ఒక మహిళతో డేటింగ్‌కు వెళ్లానని చెప్పాడు. అక్కడ ఇద్దరూ కలిసి రూ. 370 విలువైన ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ తిన్నట్లు పేర్కొన్నాడు. అంతటితో ఆగకుండా, "పైసా వసూల్ కర్నా పడేగా" అంటే పెట్టిన డబ్బును ఎలాగైనా రికవర్ చేసుకోవాలి అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించాడు. కేవలం తక్కువ ఖర్చు పెట్టినంత మాత్రాన ఆ మహిళ నుంచి లైంగిక ప్రయోజనాలను ఆశించవచ్చనే అర్థం వచ్చేలా అతడు చేసిన ఈ వ్యాఖ్యను కమెడియన్ కూడా నవ్వి, మరింత యాంప్లిఫై చేశాడు.

A 22-23-year-old Gurugram-based web developer named Himanshu Jangra lost his job after a crude joke he made at a stand-up comedy show went viral.

What happened:

> At comedian Pranit More’s live crowd-work show

> Himanshu shared that he went on a date with a slightly older… pic.twitter.com/ddPigQqP6v

— Explorer (@DailyExplorerX) June 9, 2026

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో

ఈ షోకి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియా వేదికలైన ఎక్స్ , ఇన్‌స్టాగ్రామ్‌లలో అప్‌లోడ్ అవ్వడమే ఆలస్యం.. విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రూ. 370 బిర్యానీని ఒక మీమ్‌గా మారుస్తూనే, హిమాన్షు మానసిక స్థితిని తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలను ఒక వస్తువులా, కేవలం లావాదేవీల కోణంలో చూసే ఇటువంటి ప్రెడేటరీ మనస్తత్వాన్ని హాస్యం పేరిట ఎలా సమర్థిస్తారంటూ మహిళా సంఘాలు, నెటిజన్లు నిలదీశారు. జోక్ ముసుగులో ఉన్నది ముమ్మాటికీ రేపిస్ట్ మైండ్‌సెట్ అంటూ నెట్టింట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.

హిమాన్షును ఉద్యోగం నుంచి తీసేసిన కంపెనీ

ఈ వివాదం కాస్తా హిమాన్షు పని చేస్తున్న స్టార్విక్ డిజైన్ అనే గురుగ్రామ్ ఆధారిత కంపెనీ దృష్టికి వెళ్ళింది. ఈ వైరల్ వీడియో వల్ల తమ సంస్థ ప్రతిష్ట, గౌరవానికి తీవ్ర భంగం వాటిల్లిందని యాజమాన్యం భావించింది. సోషల్ మీడియాలో వస్తున్న ఒత్తిడి, నెటిజన్ల ఆందోళనల నేపథ్యంలో స్టార్విక్ డిజైన్ సంస్థ తక్షణమే స్పందించి హిమాన్షును ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మహిళల పట్ల ఇటువంటి భావజాలం ఉన్న వ్యక్తిని తమ సంస్థలో కొనసాగించలేమని స్పష్టం చేసింది.

सोचिए ऐसी बातों पर लोग हंसते है
370 की बिरयानी खिला कर लड़की की इज्ज़त पर हाथ डालना खैर नौकरी से गया ये और कोई नौकरी पर रखने से पहले सोचेगा
और ये प्रनीत मोरे एक भी जोक पर इसकी हंसी नहीं आती और देखिए कैसे हंस रहा है । pic.twitter.com/Pg076iL655

— Sweta Srivastava (@swetasamadhiya) June 10, 2026

ఆఫీసులో గుడ్ బాయ్ హిమాన్షు

అయితే, ఈ వ్యవహారంలో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. హిమాన్షుకు ఆఫీసులో ఎలాంటి బ్యాడ్ రికార్డ్ లేదు. కార్యాలయంలో అతడి ప్రవర్తనపై ఎలాంటి ఫిర్యాదులు లేవని, ఇప్పటివరకు అతడు ప్రొఫెషనల్‌గానే వ్యవహరించాడని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ, బయట సమాజంలో మహిళల పట్ల అతడికున్న చులకన భావం, కంపెనీ ఇమేజ్‌ను దెబ్బతీయడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని యాజమాన్యం స్పష్టం చేసింది. డిజిటల్ ప్రపంచంలో క్షణకాలపు ఆనందం కోసం వేసే తప్పుడు అడుగులు కెరీర్‌ను ఎలా బూడిద పాలు చేస్తాయో చెప్పడానికి ఈ బిర్యానీ వివాదం ఒక హెచ్చరికగా నిలిచింది.