Squid Game 3 OTT Streaming : 'స్క్విడ్ గేమ్ 3' స్ట్రీమింగ్ డేట్ వచ్చేసిందోచ్... అఫీషియల్​గా గుడ్ న్యూస్ చెప్పిన నెట్‌ఫ్లిక్స్

10 months ago 8
ARTICLE AD

Squid Game 3 OTT Streaming  : సూపర్ హిట్ కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' ఫ్రాంచైజీలో ఇప్పటికే వచ్చిన రెండు సీజన్లు ఓటీటీ మూవీ లవర్స్ ను ఆకట్టుకున్నాయి. సెకండ్ సీజన్ గత ఏడాది రిలీజ్ కాగా, థర్డ్ సీజన్ గురించి ఈ సిరీస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మధ్య మధ్యలో లీక్స్ తో ఊరించిన నెట్ ఫ్లిక్స్ ఎట్టకేలకు 'స్క్విడ్ గేమ్ సీజన్ 3' ఎప్పుడు ఓటీటీలోకి రాబోతోంది అనే అప్డేట్ తో గుడ్ న్యూస్ చెప్పేసింది.

'స్క్విడ్ గేమ్ సీజన్ 3' స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
'స్క్విడ్ గేమ్ సీజన్ 3' ఈ ఏడాదే ఓటీటీలోకి రాబోతుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే కొన్ని రోజుల క్రితం స్వయంగా నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ఓ వీడియోలో 2025 లోనే సీజన్ 3 ఉండబోతుందని హింట్ ఇచ్చింది. అప్పటి నుంచి మూడవ సీజన్ స్ట్రీమింగ్ డేట్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. తాజాగా జూన్ 27 నుంచి కొత్త సీజన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నిజానికి రెండవ సీజన్ కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ మూడవ సీజన్ కి మాత్రం అంత నిరీక్షణ అక్కర్లేకుండానే రిలీజ్ చేస్తున్నారు. జూన్ 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో 'స్క్విడ్ గేమ్ సీజన్ 3' అందుబాటులోకి రానుందని తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ పోస్టులో "ఫైనల్ రౌండ్ కోసం 0ను ప్రెస్ చేయండి. 'స్క్విడ్ గేమ్ సీజన్ 3' జూన్ 27 నుంచి అందుబాటులోకి రాబోతోంది" అనే క్యాప్షన్ తో స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ వెంటనే "ఫైనల్ గేమ్ కోసం సిద్ధంగా ఉండండి" అంటూ మరికొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.

Press ⭕ for the final round.
Watch Squid Game Season 3 on 27 June. #NextOnNetflix pic.twitter.com/SwdBVLB83f
— Netflix India (@NetflixIndia) January 30, 2025

ఏడు నెలల్లోనే కొత్త సీజన్ స్ట్రీమింగ్
కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్ సీజన్ 2' గత ఏడాది డిసెంబర్ 26న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ సీజన్ రిలీజ్ అయిన మూడేళ్ల తర్వాత రెండవ సీజన్ అందుబాటులోకి వచ్చింది. రెండో సీజన్ వచ్చిన ఏడు నెలల తర్వాత 'స్క్విడ్ గేమ్ సీజన్ 3' ఓటిటిలోకి రాబోతోంది. 2021లో రిలీజ్ అయిన 'స్క్విడ్ గేమ్' ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ చరిత్రలోనే అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్ గా హిస్టరీని క్రియేట్ చేసింది. దీంతో సెకండ్ సీజన్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

డిసెంబర్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'స్క్విడ్ గేమ్ సీజన్ 2' మాత్రం ఫస్ట్ పార్ట్ లాగా పెద్దగా ప్రేక్షకులను థ్రిల్ చేయలేకపోయింది. అయినప్పటికీ టాప్ లోనే నిలిచింది. ఇక సెకండ్ సీజన్లో స్క్విడ్ గేమ్ ను ఆడించే వాళ్ళను పట్టుకొని, ఈ డెత్ గేమ్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని హీరో ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో ఊహించని విధంగా మొదటి సీజన్లో విన్నర్ గా నిలిచిన ఈ హీరో మళ్లీ సెకండ్ సీజన్లో అడుగు పెట్టాల్సి వస్తుంది. మరి ఈ గేమ్ వెనుక ఉన్న వ్యక్తిని హీరో పట్టుకోగలిగాడా? చివరికి ఏం జరిగింది ? అనేది సీజన్ 2 చూసి తెలుసుకోవాల్సిందే.

Read also : Allu Arjun : ఓటీటీ నుంచి అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ అవుట్.. డిలీట్ చేయకముందే చూడండి

Read Entire Article