Special Trains: వివిధ పండగల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway - SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా గమ్య స్థానాల మధ్య నడుస్తున్న 42 రైళ్లను పొడిగించింది.

పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు - వాటి స్టాప్‌ల వివరాలు

1. 07027/07028 చర్లపల్లి–బ్రహ్మపూర్–చర్లపల్లి మధ్య స్పెషల్ రైళ్లు (18 సర్వీసులు)

ట్రైన్ నంబర్ -రూట్స్ ఇవే...

07027 - చర్లపల్లి (Charlapalli) – బ్రహ్మపూర్ (Brahmapur)

07028 - బ్రహ్మపూర్ (Brahmapur) – చర్లపల్లి (Charlapalli)

పొడిగించిన ప్రయాణం ప్రారంభ తేదీలు:

07027 నెంబర్ ట్రైన్ డిసెంబర్ 05, 2025 నుంచి జనవరి 30, 2026 వరకు (ప్రతి శుక్రవారం) నడవనుంది.

07028: డిసెంబర్ 06, 2025 నుంచి జనవరి 31, 2026 వరకు (ప్రతి శనివారం) నడవనుంది.

సర్వీసుల సంఖ్య - 9 పోను, 9 రాను. మొత్తం 18 సర్వీసులు.

స్టాప్‌లు (రెండు దిశలలో) - నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఏలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, నౌపడ, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం.

కోచ్‌లు - 2A (సెకండ్ AC), 3A (థర్డ్ AC), స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

2. 07035/07036 చర్లపల్లి – అనకాపల్లి – చర్లపల్లి మధ్య స్పెషల్ రైళ్లు (14 సర్వీసులు)

ట్రైన్ నంబర్ 07035/07036 (గతంలో హైదరాబాద్ – అనకాపల్లి – హైదరాబాద్) ఇప్పుడు చర్లపల్లి నుంచి నడుస్తుంది.

ట్రైన్ నంబర్-రూట్ వివరాలు

07035 - చర్లపల్లి (Charlapalli) – అనకాపల్లి (Anakapalli)

07036 - అనకాపల్లి (Anakapalli) – చర్లపల్లి (Charlapalli)

పొడిగించిన ప్రయాణం ప్రారంభ తేదీలు:

07035 - డిసెంబర్ 06, 2025 నుంచి జనవరి 17, 2026 వరకు (ప్రతి శనివారం)

07036 - డిసెంబర్ 07, 2025 నుంచి జనవరి 18, 2026 వరకు (ప్రతి ఆదివారం)

సర్వీసుల సంఖ్య - 7 పోను, 7 రాను. మొత్తం 14 సర్వీసులు.

ఈ రైలు ఆగే స్టాప్‌లు (రెండు దిశలలో) - జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని మరియు ఏలమంచిలి.

కోచ్‌లు: 2AC, 3AC, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఈ ట్రైన్ లో అందుబాటులో ఉంటాయి.

3. 07651/07652 జాల్నా – ఛాప్రా – జాల్నా మధ్య స్పెషల్ రైళ్లు (10 సర్వీసులు)

ట్రైన్ నంబర్ -రూట్ వివరాలు

07651 - జాల్నా (Jalna) – ఛాప్రా (Chhapra)

07652 - ఛాప్రా (Chhapra) – జాల్నా (Jalna)

పొడిగించిన ప్రయాణం ప్రారంభ తేదీలు:

07651 - డిసెంబర్ 03, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు (ప్రతి బుధవారం)

07652 - డిసెంబర్ 05, 2025 నుంచి జనవరి 02, 2026 వరకు (ప్రతి శుక్రవారం)

సర్వీసుల సంఖ్య - 5 పోను, 5 రాను. మొత్తం 10 సర్వీసులు.

ఈ రైలు ఆగే స్టాప్‌లు (రెండు దిశలలో) - ఛత్రపతి శంభాజీనగర్, నాగ్ర్‌సోల్, అంకాై, మన్మాడ్, భూసావల్, ఖండ్వా, హర్దా, ఇటార్సి, పిపరియా, గదర్‌వాడ, నర్సింగ్‌పూర్, జబల్‌పూర్, కట్ని, మైహర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్రాజ్ ఛియోకి, వింధ్యాచల్, జియోనాథ్‌పూర్, వారణాసి, ఔన్‌రిహార్, ఘాజీపూర్ , బల్లియా.

కోచ్‌లు - 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ఈ రైలు నడవనుంది.