Son Of Telugu Movie: నాన్న సెంటిమెంట్‌తో 'సన్ ఆఫ్'... ఫిబ్రవరిలో రిలీజ్ - ఎప్పుడంటే?
2 months ago 7
ARTICLE AD
నాన్న ఎందుకో వెనుక పడ్డాడు - ఓ కార్యక్రమంలో తనికెళ్ళ భరణి చదివిన కవిత ఎంతో పాపులర్. ఇప్పుడు ఆ మాటలు గుర్తు చేశారు సంగీత దర్శకుడు రఘు కుంచె. 'సన్ ఆఫ్' సినిమా చూస్తే నాన్న ఎందుకు వెనుక పడ్డాడో అర్థం అవుతుందని ఆయన చెప్పారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ చేతుల మీదుగా సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది.
సాయి సింహాద్రి (Sai Simhadri) కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'సన్ ఆఫ్' (Son Of Movie). సాయి సింహాద్రి సైన్మా పతాకం మీద ఆయనే ప్రొడ్యూస్ చేశారు. బత్తుల సతీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నట్టు తెలిపారు.
కోన వెంకట్ మాట్లాడుతూ... ''సాయి సింహాద్రి 'సన్ ఆఫ్' కోసం ముందు హీరో అయ్యి నిర్మాత అయ్యాడా? లేదా నిర్మాత అయ్యాక హీరోగా మారాడా? తెలీదు. కానీ, ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ప్రతి శుక్రవారం వచ్చే పదుల సంఖ్యలోని సినిమాల్లో ఇటువంటి కంటెంట్ ఉన్న సినిమాలు హిట్ అయితే చాలా మంది కొత్త వాళ్ళు తెలుగు చిత్రసీలోకి వస్తారు'' అని చెప్పారు. సినిమా పెద్ద విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
'సన్ ఆఫ్' హీరో కమ్ నిర్మాత సాయి సింహాద్రి మాట్లాడుతూ... ''ఎన్నో కథలు విన్న తర్వాత సతీష్ బత్తుల చెప్పిన 'సన్ ఆఫ్' చాలా నచ్చింది. నటనలో శిక్షణ తీసుకున్నా. భాస్కర భట్ల గారి సలహాతో సంగీత దర్శకుడు రిషిని తీసుకున్నాం. కథ గురించి కూడా భాస్కరభట్ల గారితో చర్చించాం. శోభా గారు అమ్మోరులా నా చేతిని పట్టుకుని మా సినిమాను ఇంత దూరం తీసుకు వచ్చారు. ఫిబ్రవరి 27న విడుదలవుతున్న ఈ సినిమాను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది. కన్నీళ్లతో థియేటర్ నుంచి బయటకు వెళతారు'' అని అన్నారు.
Also Read: Theatrical Releases This Week: లవర్స్ డే స్పెషల్... థియేటర్లలో ఈ వారం సందడి - రెండు రీ రిలీజులు, 10 కొత్త సినిమాలు
Also Read: Sai Durgha Tej: ఇద్దరు దర్శకులతో సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా... సంక్రాంతికి చిరంజీవితో, ఇప్పుడు మేనల్లుడితో!
Read Entire Article