Soaking Feet in Salt Water : పాదాలను ఉప్పు నీటిలో పెట్టడం వల్ల కలిగే లాభాలు.. అలసట, ఒత్తిడి, నిద్ర సమస్యలకు సింపుల్ సొల్యూషన్

2 months ago 6
ARTICLE AD

Ayurvedic Foot Soak for Benefits : కొన్నిసార్లు చిన్న చిన్న టిప్స్ ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయి. అలాంటివాటిలో పాదాలు ఉప్పు నీటిలో పెట్టడం ఒకటి. ఆయుర్వేదం ప్రకారం గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి.. దానిలో పాదాలు పెట్టి కాసేపు కూర్చుంటే ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. అలసటను దూరం చేయడం నుంచి గుండె ఆరోగ్యం వరకు దీనివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

అలసట దూరం

పాదాలను గోరువెచ్చని ఉప్పు నీటిలో ముంచి.. కాసేపు రిలాక్స్ అవ్వండి. ఇది శరీరంలోని నరాలను క్రమంగా ప్రశాంతం చేస్తుంది. కండరాల దృఢత్వాన్ని తగ్గిస్తుంది. రోజులో ఉన్న భారాన్ని విడుదల చేయడానికి సహాయపడుతుంది. తేలికపాటి వెన్ను, కాళ్లు, శరీర నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

దీని తర్వాత శరీరానికి ఓ తేలికైన అనుభూతి కలుగుతుంది. రోజు భారం తొలగిపోయినట్లు అనిపిస్తుంది. ఒత్తిడి తగ్గి.. మిమ్మల్ని తాజా ఉంచుతుంది.

ఒత్తిడి దూరం

ఆయుర్వేదం ప్రకారం.. పాదాలు ఉప్పు నీటిలో పెడితే..  శరీరం మాత్రమే కాకుండా మనసును కూడా ప్రశాంతపడుతుంది. ఉప్పు, గోరువెచ్చని నీరు నాడీ వ్యవస్థపై శాంతపరిచే ప్రభావాన్ని చూపుతాయి. మానసిక ఆందోళనను తగ్గిస్తాయి. ఒత్తిడి, చిరాకు, ఆందోళన  క్రమంగా తగ్గుతాయి.
ఆయుర్వేదంలో ఉప్పును సమతుల్యత కలిగించే అంశంగా పరిగణిస్తారు. ఉప్పు నీటితో పాటు పాదాలు కలిసినప్పుడు అది మనస్సులోని అశాంతిని శాంతపరచడానికి సహాయపడుతుంది. నరాలను ప్రశాంతపరుస్తుంది. మనస్సుకు విశ్రాంతినిస్తుంది.

మెరుగైన నిద్ర కోసం..

మీరు రాత్రిపూట నిద్ర పట్టడానికి ఇబ్బంది పడుతుంటే.. లేదా తరచుగా మేల్కొంటే ఈ టెక్నిక్ కచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది. మెదడుకు ప్రశాంతమైన సంకేతాలను పంపుతుంది. వేగంగా నిద్రపోవడానికి, నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. నిద్ర సమస్యలు ఉన్నవారు రోజూ ఫాలో అయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు.

సంతోషాన్ని అందిస్తుంది..

క్రమం తప్పకుండా ఈ పద్ధతిని ఫాలో అయితే మనసు మరింత తేలికగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఈ పద్ధతి సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి హెల్ప్ చేస్తుంది. మానసిక స్థితికి దారి తీస్తుంది.

ఇవన్నీ ఒత్తిడిని తగ్గించడం వల్ల గుండెపై భారం కూడా తగ్గుతుంది. ప్రెజర్ తగ్గినప్పుడు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి మీకు రోజులో ఒత్తిడి ఎక్కువైనా, నిద్ర సమస్యలు ఉన్నా కచ్చితంగా ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. దీనిని సాయంత్రం ఫాలో అయితే మరీ మంచిది. రోజులోని అలసట తీరి.. మనసు తేలికగా ఉండి నిద్ర బాగా పడుతుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Read Entire Article