Smriti Mandhana Records | వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 5,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా టీమిండియా బ్యాటర్‌గా స్మృతి మంధానా నిలిచింది. 2025 మహిళల ప్రపంచ కప్ 13వ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధానా అర్ధ శతకం (80 పరుగులు) చేసింది. ప్రతికా రావల్‌తో కలిసి 155 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మంధానా వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా పరుగులు చేసిన విషయంలో విరాట్ కోహ్లీ, వివ్ రిచర్డ్స్‌ను కూడా అధిగమించింది. భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 330 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ కు వరుసగా రెండో ఓటమి ఓదురైంది.

విరాట్, వివ్ రిచర్డ్స్‌ను అధిగమించిన మంధానా

విరాట్ కోహ్లీ , వివియన్ రిచర్డ్స్ వన్డే క్రికెట్‌లో 5,000 పరుగులు చేయడానికి 114 ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే స్మృతి మంధానా వన్డే కెరీర్‌లో 112వ ఇన్నింగ్స్‌లో 5 వేల పరుగులు పూర్తి చేసింది. మంధానా మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 5,000 పరుగులు పూర్తి చేసింది. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ స్టెఫానీ టేలర్ పేరిట ఉంది, ఆమె 129 ఇన్నింగ్స్‌లలో ఐదు వేల పరుగుల మార్క్ చేరుకుంది.

పురుషులు, మహిళల క్రికెట్ రికార్డులను పరిశీలిస్తే, స్మృతి మంధానా అత్యంత వేగంగా 5 వేల పరుగులు పూర్తి చేసిన వారిలో మూడో స్థానంలో నిలిచింది. ఈ విషయంలో బాబర్ ఆజం (97 ఇన్నింగ్స్‌లు), హషీమ్ ఆమ్లా (101 ఇన్నింగ్స్‌లు) మాత్రమే మంధాన కంటే ముందున్నారు. మంధానా 112 ఇన్నింగ్స్‌లతో ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగ్గజాలైన వివ్ రిచర్డ్స్, విరాట్ కోహ్లీలు (114 ఇన్నింగ్స్)లను అధిగమించింది.

స్మృతి మంధానా సరికొత్త చరిత్ర

ఒక క్యాలెండర్ సంవత్సరంలో 1,000 ODI పరుగులు చేసిన ప్రపంచంలోని మొదటి మహిళా క్రికెటర్ స్మృతి మంధానా. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో మంధాన ఈ ఘనత సాధించింది. ఈ విషయంలో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ రెండో స్థానంలో నిలిచింది. ఆమె 1997లో చేసిన 970 పరుగులు ఇప్పటివరకూ అత్యధికం. మంధానా ఈ ఏడాది వన్డేల్లో 4 సెంచరీలు చేసి తన బ్యాట్ తో రఫ్ఫాడిస్తోంది. ఈ క్రమంలో 2025లో అత్యధిక వన్డే పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది.