Steve Smith Retirement: క్రికెట్ ప్రేమికులకు పెద్ద షాక్.. ఆస్ట్రేలియా స్టాండిన్ వ‌న్డే కెప్టెన్ స్టీవ్ స్మిత్ అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్ కు వీడ్కోలు ప‌లికాడు. మంగ‌ళ‌వారం భార‌త్ తో జ‌రిగిన సెమీస్ మ్యాచ్ లో నాలుగు వికెట్ల‌తో ఆసీస్ పరాజ‌యం పాలైంది. దీంతో వ‌న్డే క్రికెట్ కు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్లుగా తాజాగా స్మిత్ తెలిపాడు. 2010లో అంతర్జాతీ క్రికెట్ లో అడుగుపెట్టిన స్మిత్.. మేటి బ్యాట‌ర్ గా ఎదిగాడు. త‌న వ‌న్డే కెరీర్ లో 170 మ్యాచ్ లాడిన స్మిత్.. 5,800 ప‌రుగులు సాధించాడు. ఇందులో 12 సెంచ‌రీలు, 35 ఫిఫ్టీలు ఉన్నాయి. 43.28 స‌గ‌టుతో త‌ను ప‌రుగులు సాధించాడు. త‌న అత్య‌ధిక స్కోరు 164 కావ‌డం విశేషం. 2015, 2023 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ సాధించిన ఆసీస్ టీమ్ లో త‌ను స‌భ్యుడు కాగా, ఆసీస్ సాధించిన ఎన్నో టోర్నీల‌లో త‌నదైన ఆట‌తీరుతో స్మిత్ ప్ర‌శంస‌లు పొందాడు. అలాగే టెస్టుల్లో మేటి బ్యాటర్లలో ఒకడిగా స్మిత్ క గుర్తింపు ఉంది.

The great Steve Smith has called time on a superb ODI career 👏 pic.twitter.com/jsKDmVSG1h

— Cricket Australia (@CricketAus) March 5, 2025

రెండుసార్లు ప్రపంచ చాంపియన్ గా..
ఇన్నాళ్ల ఈ జర్నీని ఆస్వాదించాన‌ని, రెండుసార్లు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ సాధించిన జ‌ట్టులో ఉండ‌టం ఆనందంగా ఉంద‌ని రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న‌లో 35 ఏళ్ల స్మిత్ తెలిపాడు. త‌న ప్ర‌యాణంలో అడుగ‌డుగునా ఆట‌గాళ్ల‌తో క‌లిసి ఆట‌ను ఎంజాయ్ చేశాన‌ని చెప్పుకొచ్చాడు. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కోసం జ‌ట్టును సిద్ధం చేస్తున్న త‌రుణంలో త‌ను వీడిపోతున్నాన‌ని, స‌రైన ఆట‌గాళ్ల‌ను సిద్ధం చేయ‌డానికి ఇదే స‌రైన త‌రుణ‌మ‌ని వ్యాఖ్యానించాడు. ఇక భార‌త్ తో జ‌రిగిన సెమీస్ మ్యాచ్ లో ఓట‌మికి కారాణాల‌ను వెల్ల‌డించాడు. అనుభ‌వం లేని బౌల‌ర్ల‌తో ఆడి, ఓట‌మి పాల‌య్యామ‌ని పేర్కొన్నాడు.

ఇక‌పై టెస్టుల్లోనే..
మెగాటోర్నీ నుంచి ఆట‌గాళ్లు ఎంతో నేర్చుకుంటార‌ని, ఈ టోర్నీ వాళ్ల‌కు మ‌ధురంగా నిల‌వ‌నుంద‌ని స్మిత్ పేర్కొన్నాడు. ఇప్ప‌టికే టీ20లకు దూరంగా ఉంటున్న స్మిత్.. కేవ‌లం వ‌న్డేలు, టెస్టులు మాత్ర‌మే ఆడ‌తున్నాడు. తాజా రిటైర్మైంట్ తో త‌ను కేవ‌లం టెస్టుల‌కు మాత్ర‌మే ప‌రిమితం కానున్నాడు. టెస్టుల్లో, టీ20ల్లో కలిసి 183 అంతర్జాతీయ మ్యాచ్ లాడిన స్మిత్.. 36 సెంచరీలు, 46 అర్థ సెంచరీలు సాధించాడు. రెండింటిలో కలిపి 11 వేల పరుగులు సాధించాడు. మరోవైపు డేవిడ్ వార్న‌ర్ రిటైర్మెంట్ తో స‌రైన ఓపెన‌ర్ కోసం అన్వేషిస్తున్న ఆస్ట్రేలియా టీమ్ కు.. తాజాగా స్మిత్ రిటైర్మెంట్ ఇబ్బందిగా మార‌నుంది. అనుభ‌వం గ‌ల ఆట‌గాళ్లు దూరం కావ‌డంతో, జ‌ట్టు సంధి ద‌శ‌లో నిల‌వ‌నుంది. ఇక స్మిత్ రిటైర్మెంట్ పై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. గ్రేట్ స్టీవ్ స్మిత్ తన సూపర్బ్ వన్డే కెరీర్ కు వీడ్కోలు పలికాడని ట్వీట్ చేసింది. అలాగే తన వన్డే కెరీర్ వివరాలతోపాటు రెండుసార్లు ప్రపంచకప్ విన్నర్ అని అతడిని సంబోధించింది.

Read Also: ICC Champions Trophy Trolls: అప్పుడు పాక్, ఇప్పుడు ఫైన‌ల్ నాకౌట్.. ఆతిథ్య పాక్ ను ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు.. నిరాశ‌లో పాక్ ఫ్యాన్స్