Akshay Kumar Sky Force Review : గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లని ఫేస్ చేస్తున్న అక్షయ్ కుమార్ తన తాజా చిత్రం 'స్కై ఫోర్స్'తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 1965 యుద్ధంలో భారత వైమానిక దళం చూపించిన ధైర్య సాహసాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ జరగగా, దానికి గెస్ట్ గా హాజరైన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఫస్ట్ రివ్యూ ని పోస్ట్ చేశారు.

'స్కై ఫోర్స్' ఫస్ట్ రివ్యూ

ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కోసం అక్షయ్ కుమార్ 'స్కై ఫోర్స్' మూవీ స్పెషల్ స్క్రీనింగ్ ని ఏర్పాటు చేశారు. వీర్ పహారియాతో కలిసి అక్షయ్ కుమార్ నటించిన ఈ మూవీ 1965 ఇండో పాక్ యుద్ధంలో పోరాడిన స్క్వాడ్రన్ లీడర్ అజ్జమడ బొప్పయ్య దేవయ్య, ఆయన టీం నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. 1965 సెప్టెంబర్ 6న పఠాన్‌ కోట్, హల్వారాలోని భారత వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ దళాలు దాడి చేశాయి. మరుసటి రోజే ప్రతీకారంగా భారతీయ పైలట్‌ లు సర్గోధాపై సాహసోపేతమైన దాడి చేశారు. ఆసియాలోని అత్యంత పటిష్టమైన ఎయిర్‌ బేస్‌లలో ఒకటైన సర్గోధాపై ఊహించని మెరుపు దాడి చేసి, భారీ నష్టాన్ని కలిగించారు. భారత వైమానిక దళం యుద్ధ విమాన పైలట్‌ కు మరణానంతరం మహావీర చక్రను ప్రదానం చేసిన ఏకైక మిషన్ గా పేరు తెచ్చుకున్న ఈ యుద్ధం చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందింది.

Thank you, Sir. An absolute honour for me and the team of Skyforce that you, the CDS and the three service chiefs took out time to watch and bless our film. We’ve made it with a lot of gratitude and pride for the courage of our armed forces. 🙏 https://t.co/6o0CcDCu8H

— Akshay Kumar (@akshaykumar) January 21, 2025

'స్కై ఫోర్స్' స్క్రీనింగ్ అనంతరం రాజ్ నాథ్ సింగ్ ఎక్స్ లో దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. అలాగే ఇంత అద్భుతమైన సినిమాను తెరకెక్కించినందుకు చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. తన పోస్టులో రాజ్ నాథ్ సింగ్ "స్కై ఫోర్స్ స్పెషల్ స్క్రీనింగ్ లో సినిమాను సిడిఎస్, ముగ్గురు సర్వీస్ చీఫ్ లతో కలిసి చూసాను. ఈ మూవీ 1965 యుద్ధంలో భారత వైమానిక దళం సాహస ధైర్యాలు, త్యాగాన్ని చూపిస్తుంది. చిత్ర నిర్మాతల ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను" అంటూ రాసుకొచ్చారు.

మంత్రికి అక్షయ్ కుమార్ రిప్లై

ఇక రాజ్ నాథ్ సింగ్ ప్రశంసలకు పొంగిపోయిన అక్షయ్ రిప్లై ఇస్తూ "ధన్యవాదాలు సార్. మీరు, సీడీఎస్ అండ్ ముగ్గురు సర్వీస్ చీఫ్ లు సినిమాను వీక్షించడం, ఆశీర్వదించడానికి టైం స్పెండ్ చేయడం నాకు, మా 'స్కై ఫోర్స్' బృందానికి గౌరవంగా భావిస్తున్నాము. మా సాయుధ దళాల ధైర్యానికి గర్వంగా, కృతజ్ఞతగా ఈ సినిమాని చేసాము" అంటూ చెప్పుకొచ్చారు.

స్పెషల్ స్క్రీనింగ్ ఇదే మొదటిసారి కాదు...

గతంలో కూడా ఢిల్లీలో ఎన్సిసి క్యాండేట్ల కోసం 'స్కై ఫోర్' మూవీ స్పెషల్ స్క్రీనింగ్ ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు దినేష్ విజన్, అమర్ కౌశిక్ కూడా అప్పట్లో పాల్గొన్నారు. అంతేకాకుండా భారత వైమానిక దళానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్, దిశా సెల్ కు కూడా స్పెషల్ షోలు వేశారు. 'స్కై ఫోర్స్' సినిమాతో వీర్ పహారియా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించగా, ఈ మూవీలో సారా అలీ ఖాన్ దివంగత సైనికుడి భార్యగా నటిస్తోంది. అభిషేక్ అనిల్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జియో స్టూడియోస్, మాడాక్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 24న రిపబ్లిక్ డే కానుకగా 'స్కై ఫోర్స్'ను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

Also Read: అఖిల్ అక్కినేని పెళ్లికి ముహూర్తం ఫిక్స్... వెడ్డింగ్ డేట్, వెన్యూ వివరాలు తెలుసా?