Skoda Octavia RS Launched In India At 49.99 Lakh Price: భారత మార్కెట్‌లో కార్‌ లవర్స్‌కి సర్‌ప్రైజ్‌గా, Skoda, తన కొత్త Octavia RS మోడల్‌ను లాంచ్‌ చేసింది. ధర ₹49.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఇది లగ్జరీ కారు కాబట్టి ఈ మాత్రం రేటు ఉంటుంది. అయితే, షాకింగ్‌ విషయం ఏమిటంటే - ఈ పెర్ఫార్మెన్స్‌ సెడాన్‌ సేల్‌కు ముందే సేల్‌ అయింది. సింపుల్‌గా చెప్పాలంటే, ఈ కారు లాంచ్‌కు ముందే పూర్తిగా సేల్‌ అయిపోయింది. అక్టోబర్‌ 6న బుకింగ్స్‌ (సేల్స్ కాదు) ఓపెన్‌ అయ్యాయి, 100 కార్లను అందుబాటులో ఉంటారు. కేవలం కొన్ని గంటల్లోనే అన్ని యూనిట్లు పూర్తిగా అమ్ముడవ్వడం విశేషం.

అత్యంత శక్తిమంతమైన Octavia RS
ఈ కొత్త Octavia RSలో Volkswagen గ్రూప్‌నకు చెందిన ప్రసిద్ధ EA888 ఇంజిన్‌ ఉంది. ఈ 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 265 హెచ్‌పీ పవర్‌, 370 ఎన్ఎమ్‌ టార్క్‌ ఇస్తుంది. ఇది 7 స్పీడ్‌ DSG ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో కలిసి ఫ్రంట్‌ వీల్స్‌కి పవర్‌ పంపుతుంది. ఈ పవర్‌తో, ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.4 సెకన్లలో చేరుతుంది. ఆక్సిలేటర్‌ తొక్కిపడితే, Octavia RS టాప్‌ స్పీడ్‌ 250 కి.మీ./గం అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. స్పోర్ట్స్‌ ఎగ్జాస్ట్‌ సిస్టమ్‌ స్టాండర్డ్‌గా వస్తుంది, కానీ Dynamic Chassis Control (DCC) మాత్రం ఇండియన్‌ వెర్షన్‌లో అందించలేదు.

ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌ - స్పోర్టీ లుక్‌

Octavia RS బయటి బాడీ కిట్‌ పూర్తిగా స్పోర్టీ లుక్‌తో రూపొందించారు.

19 ఇంచుల అల్లాయ్‌ వీల్స్‌, బ్లాక్‌ ఎక్స్‌టీరియర్‌ ఫినిష్‌, RS బ్యాడ్జింగ్‌, లిప్‌ స్పాయిలర్‌ - ఇవన్నీ కలిసి ఈ కారు ప్రెజెన్స్‌కు మరింత బూస్ట్‌ ఇస్తాయి.

Octavia RS కలర్స్‌ - ఇది Candy White, Magic Black, Mamba Green, Race Blue, Velvet Red అనే ఐదు ఆకర్షణీయమైన కలర్స్‌లో లభిస్తుంది.

ఇంటీరియర్‌ – ఆల్‌ బ్లాక్‌ కేబిన్‌, ప్రీమియం టచ్‌

ఇంటీరియర్‌లో ఆల్‌ బ్లాక్‌ థీమ్‌తో పాటు రెడ్‌ స్టిచింగ్‌ కలిపి స్పోర్టీ ఫీల్‌ ఇస్తుంది. స్పోర్ట్స్‌ సీట్స్‌, ఫ్లాట్‌ బాటమ్‌ 3-స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌ వంటివి రేసింగ్‌ టచ్‌ ఇస్తాయి.

13 ఇంచ్‌ల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, 10.25 ఇంచ్‌ల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, 11 స్పీకర్‌ Canton సౌండ్‌ సిస్టమ్‌, 360° కెమెరా, మ్యాట్రిక్స్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, వైర్‌లెస్‌ Android Auto & Apple CarPlay, 3-జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, హీట్‌డ్‌ సీట్స్‌,
మసాజ్‌ ఫంక్షన్‌, 10 ఎయిర్‌బ్యాగ్స్‌, అడాప్టివ్‌ క్రూజ్‌ కంట్రోల్‌ వంటి హై-ఎండ్‌ ఫీచర్లు ఉన్నాయి.

పోటీ కార్లు & ప్రైస్‌ పాయింట్‌

Octavia RSకి ప్రధాన పోటీదారు Volkswagen Golf GTI, దీని ధర ₹50.91 లక్షలు.

పాత Octavia RS 245తో పోలిస్తే కొత్త వెర్షన్‌ ₹14 లక్షల ఎక్కువ ధరతో వచ్చింది.

కానీ, BMW M340i, Audi S5 Sportback లాంటి జర్మన్‌ సెడాన్‌లతో పోలిస్తే Octavia RS చాలా అందుబాటులో ఉందనే చెప్పాలి.

స్పోర్ట్స్‌ పెర్ఫార్మెన్స్‌, ప్రీమియం కంఫర్ట్‌, యూరోపియన్‌ స్టైల్‌ కలిపి Octavia RS నిజంగా డ్రీమ్‌ కారు. అందుకే లాంచ్‌కి ముందే అన్ని యూనిట్లు సేల్‌ అయిపోయాయి.