Skin Tan Removal Tips : సమ్మర్​లో ముఖం నల్లగా మారుతుందా? ఈ ఇంటి చిట్కాలతో టాన్​ని వదిలించుకోండిలా

9 months ago 7
ARTICLE AD

Detan in Natural Way : వేసవికాలంలో ఎండల వల్ల స్కిన్​ సహజంగానే టాన్ అయిపోతుంది. యూవీ కిరణాల వల్ల చర్మం మెలనిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల స్కిన్ టాన్​ అవుతుంది. పిగ్మెంటేషన్ పెరుగుతుంది. దీనిని అలాగే వదిలేస్తే మొండిగా మారిపోతుంది. అందుకే ఇంటి చిట్కాలతో టాన్​ని వదిలించుకోవచ్చు. ఎంత సన్​స్క్రీన్ ఉపయోగించినా మీరు ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవుతూ ఉంటే.. స్కిన్​ హెల్త్​ని మెరుగు చేసి.. బ్రైట్​ లుక్​ని పొందవచ్చు.

ఎక్స్​ఫోలియేషన్..

టానింగ్​ను తొలగించడానికి ఎక్స్​ఫోలియేషన్ బెస్ట్ ఆప్షన్. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి.. మంచి మెరుపును అందిస్తుంది. ఇంట్లోనే ఎక్స్​ఫోలియేట్ చేయాలనుకున్నప్పుడు ఓట్​మీల్, శనగపిండిని ఉపయోగించవచ్చు. వీటిలో పాలు లేదా పెరుగు వేసి స్క్రబ్​గా మార్చుకోవచ్చు. ఇది డెడ్ స్కిన్​ సెల్స్​ను తొలగించి.. మెరుపును అందిస్తుంది. చర్మం రంగును మెరుగుపరిచి టాన్​ను తొలగిస్తుంది.

నిమ్మరసంతో కూడా

నిమ్మరసంలో తేనెను కలిపి.. దానిని ముఖానికి అప్లై కూడా చేయవచ్చు. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని కాంతివంతం చేయడంలో హెల్ప్ చేస్తుంది. తేనె హైడ్రేషన్​ను అందిస్తుంది. ఈ రెండు టాన్​ను తొలగించి.. మృదువైన చర్మాన్ని ప్రమోట్ చేస్తాయి.

హైడ్రేషన్..

ఎండవల్ల త్వరగా డీహైడ్రేట్ అయిపోతారు. దీనివల్ల స్కిన్​ డల్​గా, నిర్జీవంగా మారుతుంది. దీనివల్ల కూడా నలుపుదనం పెరుగుతుంది. కాబట్టి కలబంద వంటి వాటిని ఉపయోగించవచ్చు. ఇది ఎండనుంచి స్కిన్​ని కాపాడుతుంది. కలబందలోని ఎంజైమ్​లు, విటమిన్లు పిగ్మెంటేషన్​ను తగ్గిస్తాయి. స్కిన్​ ర్యాష్​లను సైతం దూరం చేస్తాయి. అంతేకాకుండా నీటిని, సహజమైన జ్యూస్​లను కూడా తాగితే హైడ్రేటెడ్​గా ఉంటారు.

టోనర్​గా బెస్ట్

కీరదోస, రోజ్​వాటర్ మాస్క్​ వంటివి చర్మానికి మరింత హైడ్రేషన్​ని అందిస్తాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కిన్​ తేమగా మారుతుంది. యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతం చేయడంలో హెల్ప్ చేస్తాయి. సమ్మర్​లో రోజ్​వాటర్​ని టోనర్​గా ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. రెడ్​నెస్ కూడా తగ్గుతుంది. pH స్థాయిలను మెరుగుపరుస్తుంది.

ఫేస్ ప్యాక్​..

పసుపును డీటానింగ్​కు ఉపయోగించవచ్చు. దీనిలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీనిని పెరుగులో కలిపి ముఖానికి అప్లై చేస్తే పిగ్మెంటేషన్​ పోతుంది. చర్మం రంగును మెరుగుపరుస్తుంది. బియ్యం పిండిలో పాలు, పసుపు వేసి పేస్ట్​గా చేసి కూడా ముఖానికి అప్లై చేయొచ్చు. దీనివల్ల కూడా టానింగ్​ని తగ్గించవచ్చు.

Also Read : ఈ ఫేస్​ మాస్క్​లతో గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం.. ఇంట్లో ట్రై చేసేయండిలా

మరిన్ని టిప్స్

కెమికల్స్ లేకుండా స్కిన్​ని టాన్​నుంచి కాపాడుకోవాలనుకుంటే వీటిని రెగ్యులర్​గా ట్రై చేయవచ్చు. టమాటోతో స్క్రబ్ చేసిన కూడా టానింగ్​ తగ్గుతుందని గుర్తించుకోవాలి. బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా సన్​స్క్రీన్ పెట్టుకోవాలి. సూర్యరశ్మికి స్కిన్ ఎక్స్​ఫోజ్ కాకుండా మాస్క్​లేదా స్కార్ఫ్ ఉపయోగిస్తే మంచిది. కూలింగ్ గ్లాసెస్ కూడా మంచి ఫలితాలిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ సహజమైన గ్లోయింగ్ టిప్స్​ని ఫాలో అయిపోండి.

Also Read : గ్లోయింగ్ మేకప్​ లుక్​ కావాలంటే వీటిని కచ్చితంగా ఫాలో అవ్వాలి.. సమ్మర్​లో ఇలా ట్రై చేయండి

Read Entire Article