Sing Geetham's Sing Geetham OTT Release Platform Locked : లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డ్రీమ్ ప్రాజెక్ట్ సింగ్ గీతం శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన డైరెక్టర్... మ్యూజికల్ ఫాంటసీ డ్రామాతో మ్యాజిక్ చేశారు. ఈ క్రమంలో మూవీ ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా... 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. జులై సెకండ్ వీక్ లేదా లాస్ట్ వీక్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా... అయాన్, అహల్య బుమ్రా, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటించారు.

వీరితో పాటే రేవతి, అమృతం ఫేం నారిపెద్ది శివన్నారాయణ, బెనర్జీ, అగు స్టాన్లీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించారు. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

Also Read : Gopichand Birthday : గోపీచంద్‌ బర్త్ డే స్పెషల్ - అలా సినిమాల్లోకి ఎంట్రీ... మ్యాచో స్టార్ గురించి ఈ విషయాలు తెలుసా?