Singeetham Srinivasarao's Sing Geetham OTT Streaming : లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు లేటెస్ట్ నేచురల్ ఫాంటసీ డ్రామా సింగ్ గీతం (Sing Geetham). 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన సింగీతం అద్భుతంగా మూవీని తెరకెక్కించారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించారు. జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

సడన్‌గా స్ట్రీమింగ్

ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' (Netflix)లో బుధవారం నుంచి 'సింగ్ గీతం' స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం నుంచి స్ట్రీమింగ్ చేస్తామని ముందు అనౌన్స్ చేసినా ఒక రోజు ముందుగానే అందుబాటులోకి వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. 'కుబేరపురానికి స్వాగతం. మీరు పాటలో గొంతు కలపడానికి సిద్ధంగా ఉన్నారా?' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ మూవీలో అయాన్, అహల్య బమ్రూ ప్రధాన పాత్రల్లో నటించగా... షాలిని కొండేపూడి, బెనర్జీ, తులసి, అమృతం ఫేం శివన్నారాయణ, అగు స్టాన్లీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. లెజెండరీ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా... వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంస్థలపై నాగ్ అశ్విన్ నిర్మించారు.

Also Read : Chennai Love Story Plot : బేబీ Vs చెన్నై లవ్ స్టోరీ - నో కాంట్రవర్సీ ఓన్లీ క్యూట్ లవ్ స్టోరీ... ప్రొడ్యూసర్ SKN చెప్పిన కథ