Siddu Jonnalagadda Joins In Social Media X : టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తాజాగా సోషల్ మీడియా 'X'లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన హీరోగా చేస్తోన్న రీసెంట్ మూవీ 'తెలుసు కదా' గురించి పోస్ట్ చేస్తూ సర్ ప్రైజ్ ఇచ్చారు. 'హలో 'X' నేను మీ... తెలుసు కదా' అంటూ ఓ ఫన్ ఎమోజీతో పోస్ట్ చేశారు. 'లవ్ యూ 2... అక్టోబర్ 17న థియేటర్లలో కలుద్దాం' అంటూ రాసుకొచ్చారు. దీంతో ఇది వైరల్ అవుతోంది.

అంతకు ముందు సిద్ధూకు ఓ 'X' అకౌంట్ ఉండగా... దానిలో అంతగా యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు తాజాగా మరో 'X' అకౌంట్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఆయన లేటెస్ట్ మూవీ 'తెలుసు కదా' ప్రమోషన్స్ కోసం దీన్ని వాడుతున్నారు.

టిల్లూ భాయ్‌కు గ్రాండ్ వెల్ కం

మన టిల్లూ భాయ్‌కు నెటిజన్లు గ్రాండ్ వెల్ కం చెబుతున్నారు. 'అన్నొచ్చాడు Xలోకి అన్నొచ్చేశాడు', 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'తెలుసు కదా' మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

Also Read: 8th ఫెయిల్... 'ఉగ్రం' To ఎన్టీఆర్ 'డ్రాగన్' - ప్రశాంత్ నీల్ దేవుడన్న 'సలార్' మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్