Karnataka CM Siddaramaiah ignoring German Chancellor: ఓ దేశాధినేత వస్తే ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి స్వాగతం పలకాలి. కానీ ఆయన కన్నా తమ పార్టీ నేత రాహుల్ గాంధీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఇప్పుడీ అంశం రాజకీయ దుమారం రేపుతోంది.

జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ బెంగళూరు పర్యటనకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ గైర్హాజరు కావడం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రపంచంలోని అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జర్మనీ దేశాధినేత రాష్ట్రానికి వచ్చినప్పుడు, స్వయంగా ముఖ్యమంత్రి స్వాగతం పలికి పెట్టుబడుల గురించి చర్చించాల్సింది పోయి.. ఆ కార్యక్రమాన్ని విస్మరించడంపై విపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇది రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని విమర్శించింది.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ అదే సమయంలో మైసూర్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవడానికి ప్రాధాన్యతనిచ్చారని బీజేపీ ఆరోపించింది. రాష్ట్ర ప్రగతి కంటే రాజకీయ విధేయతకే కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపిందని కర్ణాటక ప్రతిపక్ష నేత ఆర్. అశోక విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కంటే హైకమాండ్ ప్రసన్నమే ముఖ్యం అనుకోవడం కన్నడిగులకు జరుగుతున్న ద్రోహం అని ఆయన మండిపడ్డారు. ఛాన్సలర్ మెర్జ్ బెంగళూరు విమానాశ్రయానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఎం.బి. పాటిల్ ఆయనకు స్వాగతం పలికారు.

Misplaced priorities
Missed opportunities

Today, the German Federal Chancellor visited Karnataka - a moment of immense diplomatic, economic and strategic significance for our state.

Any other responsible Chief Minsiter would have personally ensured that such a visit was… https://t.co/pDjq5Oj6q2 pic.twitter.com/t8k981Q60K

— R. Ashoka (@RAshokaBJP) January 13, 2026

జర్మనీ ఛాన్సలర్ తన పర్యటనలో భాగంగా బెంగళూరులోని బాష్ క్యాంపస్‌ను, అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేంద్రాన్ని సందర్శించారు. కర్ణాటకలో పారిశ్రామికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు ఇదొక సువర్ణావకాశమని, కానీ ముఖ్యమంత్రి దీనిని కేవలం ప్రోటోకాల్ అంశంగా చూసి వదిలేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా రావలసిన భారీ పెట్టుబడుల అవకాశాలను రాష్ట్రం కోల్పోయే ప్రమాదం ఉందని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి.

ತಮಿಳುನಾಡಿಗೆ ತೆರಳುವ ಮಾರ್ಗಮಧ್ಯೆ ಮೈಸೂರಿಗೆ ಆಗಮಿಸಿದ ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ನಾಯಕರಾದ ರಾಹುಲ್ ಗಾಂಧಿಯವರನ್ನು ರಾಜ್ಯಕ್ಕೆ ಪ್ರೀತಿಯಿಂದ ಬರಮಾಡಿಕೊಂಡು, ಶುಭ ಹಾರೈಸಿದೆ.

On his way to Tamil Nadu, our proud leader Shri @RahulGandhi stopped in Mysuru. I warmly welcomed him to the state and extended my best… pic.twitter.com/5TXO6EqzBZ

— Siddaramaiah (@siddaramaiah) January 13, 2026

మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీ ఈ విమర్శలను తోసిపుచ్చింది. ప్రభుత్వం తరపున సంబంధిత మంత్రి ఇప్పటికే ఛాన్సలర్‌కు ఘన స్వాగతం పలికారని, దీనిని అనవసరంగా రాజకీయం చేయవద్దని సూచించింది. అయినప్పటికీ, అంతర్జాతీయ స్థాయి నేతలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా హాజరుకాకపోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఇది రాష్ట్రం గ్లోబల్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని సోషల్ మీడియాలో సైతం చర్చ జరుగుతోంది.