Shukra Gochar 2026: శుక్రుడు సంపద, శ్రేయస్సు, ప్రేమ, ఆనందం, శృంగారం, విలాసం, ఐశ్వర్యానికి కారణమైన గ్రహం అని చెబుతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రుడు ఫిబ్రవరి 5న కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఈ ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది.

జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడు అత్యంత ముఖ్యమైన గ్రహాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇది ఒక వ్యక్తి జీవితకాలంలో ఆర్థిక శ్రేయస్సు, కీర్తిని శాసిస్తుంది. దీని మహాదశ దాదాపు 20 సంవత్సరాలు, ఎక్కువ కాలం ఉంటుంది. అయితే, శుక్రుడు మంచి స్థితిలో ఉంటే, అది దాని మహాదశలో కూడా విజయాన్ని తెస్తుంది.

శుక్రుడు ఫిబ్రవరి 5న కుంభరాశిలోకి ప్రవేశించాడు ...మార్చి 2 వరకు ఇదే రాశిలో సంచరిస్తాడు. అక్కడే ఉంటాడు. దీని తరువాత, శుక్రుడు మీనంలోకి వెళ్తాడు. ఈ సమయంలో, శుక్రుని శుభ ప్రభావం వాయు రాశులపై పడుతుంది. ఈ రాశుల గురించి మరింత తెలుసుకోండి.

మిథున రాశి

శుక్రుడు మీ రాశి నుంచి తొమ్మిదో ఇంట్లోకి ప్రవేశించాడు, ఇది అదృష్టానికి సంబంధించినది. ఈ సంచారం మీకు అదృష్టాన్నిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది. మార్చి 2 వరకూ మీరు చేయాలి అనుకున్న పనులు ప్రణాళిక ప్రకారం పూర్తిచేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకూ బయటపడతారు

తులా రాశి

శుక్రుడు మీ రాశి నుండి ఐదవ ఇంట్లోకి ప్రవేశించాడు, ఇది తెలివితేటలు, విచక్షణ, ప్రేమకు సంబంధించినది. ఈ సమయంలో మీరు మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు. ప్రేమ , వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.

కుంభ రాశి

శుక్రుడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ శుక్ర సంచారము కుంభ రాశివారికి ఆనందం శ్రేయస్సును తెస్తుంది, కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వివాహం కానివారికి వివాహ సూచనలున్నాయి

ఈ మూడు వాయు రాశులు అయితే మిగిలిన రాశులేంటి?

12 రాశులను పంచభూతాలకు ప్రతీకగా చెబుతారు..వీటిలో జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, భూ తత్వానికి సంబంధించి మూడు మూడు రాశులుంటాయి

కర్కాటకం రాశి, వృశ్చికం రాశి, మీన రాశి ఈ మూడు జలతత్వానికి సంబంధించినవి

మేష రాశి, సింహ రాశి, ధనస్సు రాశి ఈ మూడు అగ్నితత్వానికి సంబంధించినవి

వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఈ మూడు భూ తత్వానికి సంబంధించినవి

మిథున రాశి, తులా రాశి, కుంభ రాశి ఈ మూడు వాయుతత్వానికి సంబంధించినవి

మీ రాశి తత్వం ఆధారంగా మీ ప్రవర్తన, మీ మనస్తత్వం ఉంటుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు

అగ్నికి సంకేతం అయిన రాశులవారు సాహసోపేతంగా వ్యవహరిస్తారు, ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఎదురైన ప్రతి సమస్యను పాఠంగా స్వీకరిస్తారు. పాతవిషయాలను అగ్నికి ఆహుతైన పాతవస్తువుల్లా వదిలేసి..ముందడుగు వేస్తారు. జీవితంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తారు

నీటికి సంకేతం అయిన రాశులవారిలో అంతర్ దృష్టి ఎక్కువగా ఉంటుంది. కలలు కనడమే కాదు వాటిని నిజం చేసుకునేందుకు కఠిన ప్రయత్నాలు చేస్తారు. నిశ్శబ్ధంలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. జరిగినది మళ్లీ తిరిగితీసుకురాలేం..రేపు ఎలా ఉంటుందో తెలియదు.. ఈ క్షణాన్ని ఆస్వాదిద్దాం అనేలా ఉంటారు.

భూమి సంకేతానికి చెందిన రాశువారిలో భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. భౌతిక వస్తువులకు త్వరగా ఆకర్షితులవుతారు. భూదేవికి ఉన్నంత సహనం వీరికి ఉంటుంది. ఏ విషయంలో అయినా విశ్వసనీయంగా, ఆచరణాత్మకంగా వ్యవహిస్తారు. వీరు నమ్మదగిన వ్యక్తులు

గాలి సంకేతానికి చెందిన రాశులవారు ప్రేమ, కమ్యూనికేషన్లో నిపుణులు. మంచి స్నేహితులు. సంభాషణా నిపుణులు. వీరికి తాత్విత చర్చలు, మంచి పుస్తకాలంటే ఇష్టం

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.