Shubman Gill Dominates ODI Rankings Post Afghanistan Series: ఐసీసీ బుధవారం రిలీజ్ చేసిన లేటెస్ట్ వన్డే ర్యాంకింగ్స్‌లో ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మూడు స్థానాలు ఎగబాకి సెకండ్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రెజెంట్ గిల్ .. నెంబ‌ర్ వ‌న్ ప్లేస్ లో ఉన్న న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్ కంటే కేవలం 24 రేటింగ్ పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. అఫ్గానిస్తాన్‌తో రీసెంట్ గా ముగిసిన త్రీ-మ్యాచ్ వన్డే సిరీస్‌లో గిల్ క్లాస్ పర్ఫార్మెన్స్ చూపించాడు. ఇండియా 9 వికెట్ల తేడాతో గెలిచిన లాస్ట్ వన్డేలో గిల్‌కు బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు, కానీ ఫస్ట్ రెండు మ్యాచుల్లో అతను 84, 154 రన్స్ భారీ స్కోర్లు చేసి ఈ అడ్వాంటేజ్ అందుకున్నాడు. ఇదే సిరీస్ లో అదరగొట్టిన ఇషాన్ కిషన్ ఏకంగా 21 స్థానాలు మెరుగుపరుచుకుని 43వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

India dominates the ICC Men’s ODI Batting Rankings as Shubman Gill, Virat Kohli, and Rohit Sharma continue to shine among the world's best batters. A strong statement from Indian cricket on the global stage!
.#ShubmanGill#ViratKohli#RohitSharma#ICCRankings#Thefoxdailynews pic.twitter.com/Ow0vuQ58Eg

— The Fox Daily (@Thefoxdailynews) June 24, 2026

విరాట్ కోహ్లీకి ఇంజ్యురీ దెబ్బ.. రోహిత్ శర్మ ఫోర్త్ ప్లేస్
హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యురీ కారణంగా అఫ్గానిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం కావడం అతని ర్యాంకింగ్‌పై ఎఫెక్ట్ చూపించింది. కోహ్లీ ఒక స్థానం కిందకు జారి థర్డ్ ప్లేస్ కి పడిపోయాడు. మరోవైపు ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫోర్త్ ప్లేస్ లోనే కింగ్ లా కంటిన్యూ అవుతున్నాడు. మిగిలిన ఇండియన్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 14వ ప్లేస్ కి చేరగా, కేఎల్ రాహుల్ రెండు స్థానాలు దిగజారి 11వ ర్యాంక్‌కు పడిపోయాడు. బౌలింగ్ విభాగంలోనూ ఇండియన్స్ దూసుకుపోయారు. అర్ష్‌దీప్ సింగ్ 16 స్థానాలు ఎగబాకి 22వ ర్యాంక్, ప్రసిద్ధ్ కృష్ణ 34 ప్లేసెస్ జంప్ చేసి 58వ ర్యాంక్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 17 స్థానాలు క్లైంబ్ చేసి జాయింట్ 71వ ర్యాంక్‌కు రీచ్ అయ్యారు.

Read Also: Rishabh Pant Shares Farewell Message: 12 కోట్ల నష్టానికి పాత గూటికి చేరిన పంత్.. లక్నోకు కేవలం 3 ముక్కల వీడ్కోలు సందేశం

బుమ్రా నంబర్ వన్ సీటు షేరింగ్..
టెస్ట్ క్రికెట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక బిగ్గెస్ట్ చేంజ్ నమోదైంది. ఇంగ్లాండ్‌తో జరిగిన సెండ్ టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా 11 వికెట్లు తీసి న్యూజిలాండ్ 253 రన్స్ భారీ విక్టరీ సాధించడంలో కీ రోల్ ప్లే చేసిన పేసర్ మ్యాట్ హెన్రీ నంబర్ వన్ స్పాట్ కు దూసుకొచ్చాడు. దీంతో ఇండియా స్టార్ స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి అతను టాప్ ర్యాంక్‌ను షేర్ చేసుకుంటున్నాడు. నవంబర్ 2024 లో కాగిసో రబాడాను వెనక్కి నెట్టి బుమ్రా నంబర్ వన్ ప్లేస్ లో సెటిల్ అయ్యాడు, కానీ ఇప్పుడు 34 ఏళ్ల హెన్రీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సిరీస్‌ను 1-1 తో ఈక్వల్ చేస్తూ బుమ్రా సీటుకు పార్ట్‌నర్ అయ్యాడు.

జో రూట్ నంబర్ వన్ బ్యాటర్
న్యూజిలాండ్ క్రికెట్ హిస్టరీలో ఒక ఫాస్ట్ బౌలర్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ప్లేస్ కి చేరడం సుదీర్ఘమైన 36 ఏళ్ల తర్వాత ఇదే ఫస్ట్ టైమ్. గతంలో జాక్ కోవీ (1947), రిచర్డ్ హ్యాడ్లీ (1984-1990) మాత్రమే కివీస్ తరఫున ఈ రేర్ ఫీట్ సాధించారు. ఆ తర్వాత మళ్లీ మ్యాట్ హెన్రీ మాత్రమే ఈ హిస్టారికల్ మైలురాయిని అందుకోగలిగాడు. ఐసీసీ బౌలింగ్ చార్ట్స్ లో కివీస్ లాంగ్ డ్రౌట్ ను హెన్రీ బ్రేక్ చేశాడని ఐసీసీ స్పష్టం చేశాడు. ఇక టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ స్టాండ్-ఇన్ కెప్టెన్ జో రూట్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని మళ్లీ వరల్డ్ నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్ సింహాసనాన్ని రీక్లెయిమ్ చేసుకున్నాడు.