ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు చెబుతారు. అయితే... శ్రవణ్ రెడ్డి (Shravan Reddy) రూటు మాత్రం డిఫరెంట్. మొదట ఆయన రచ్చ గెలిచి, ఆ తర్వాత ఇంట గెలిచారు. హిందీ టీవీ సీరియళ్ళు, రియాలిటీ షోలతో తొలుత శ్రవణ్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన 'డర్టీ హరి'తో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇప్పుడు 'అగధ'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో ఆయన నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి.

హీరో... యాంటీ హీరో... రెండూ శ్రవణ్ రెడ్డి
ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన మిస్టిక్ హారర్ థ్రిల్లర్ 'అగధ'. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్లు నమోదు చేస్తోంది. రెగ్యులర్ హారర్ సినిమాల్లో కనిపించే జంప్ స్కేర్స్, ఘోస్ట్ ఫార్ములాకు భిన్నంగా ఆధ్యాత్మికత అంశాలు, అతీంద్రీయ శక్తుల నేపథ్యంలో 'అగధ'ను తెరకెక్కించారు.

'డర్టీ హరి'తో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కు దగ్గరైన శ్రవణ్ రెడ్డి... ఇప్పుడు 'అగధ'తో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కెరీర్ స్టార్టింగ్‌లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించే అవకాశం అతనికి దక్కింది. 'అగధ'తో శ్రవణ్ రెడ్డికి దక్కిన అరుదైన అవకాశం ఏమిటంటే... సినిమాలో హీరో, యాంటీ హీరో - రెండూ ఆయనే.

Also Read: Vijay Son Jason Sanjay Sigma Release Date - గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో

'అగధ' సినిమా ఓపెనింగ్ చూస్తే... సాధారణ యువకుడిలా శ్రవణ్ రెడ్డి కనిపిస్తారు. ఆ తర్వాత సినిమా ముందుకు వెళ్ళే కొలదీ రెండు పాత్రల్లో లేయర్లు రివీల్ అవుతూ ఉంటాయి. మంచి, చెడు మధ్య యుద్ధంలో గ్రే షేడ్స్‌ను శ్రవణ్ రెడ్డి ఆవిష్కరించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. అటు హీరోగా, ఇటు యాంటీ హీరోగా... రెండు పాత్రల్లోనూ మెప్పించారు. సీన్ డిమాండ్ చేయడంతో న్యూడ్‌గా కూడా కనిపించారు.

Also Read: Bigg Boss 7 Winner Anumol RS Karthu Wedding - తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

ఛత్తీస్‌గఢ్‌లోని అడవుల్లో జరిగే క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యల నేపథ్యంలో 'అగధ' తీశారు. దైవిక శక్తులు కల యోగిని మహాదేవి పాత్రలో కామాక్షి భాస్కర్ల నటనకు సైతం ప్రశంసలు దక్కుతున్నాయి. ఆమెకు ధీటుగా శ్రవణ్ రెడ్డి నటించారని చెప్పడం అతిశయోక్తి కాదు. 'డర్టీ హరి' తర్వాత 'మంగళవారం'లో నటించారు శ్రవణ్ రెడ్డి. అందులోనూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు.

Also Read: Ravi Teja Irumudi Censor Review - 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?