Bengaluru Horror: కొన్ని సరదాలు పిల్లల ప్రాణాల మీదకు తెస్తాయి. క్షణకాలంలో వారిని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలు తీస్తాయి. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వీడియో తెలియజేస్తోంది. రూప్ టాప్ కారులో వెళ్తున్న బాలుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన బెంగళూరు పట్టణంలో జరిగింది.

బెంగళూరులోని ఓ ప్రాంతంలో కారు స్పీడుగా వెళ్తుండగా.. కారు రూప్‌టాప్‌లో నుంచి బాలుడు నిల్చొని ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓవర్‌హెడ్ బ్యారియర్‌ను బాలుడు గుర్తించలేదు. దీంతో ఆ ఓవర్‌హెడ్ బ్యారియర్ బాలుడికి బలంగా తాకడంతో కారులో కుప్పకూలిపోయాడు.

Next time when you leave your kids popping their heads out, think once again! pic.twitter.com/aiuHQ62XN1

— ThirdEye (@3rdEyeDude) September 7, 2025

ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అధికారులు తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తున్నారు. సరదాలకు పోయి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. అన్ సేఫ్ డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. నెటిజన్లు సైతం స్పందిస్తున్నారు. చిన్న సరదాలు ఇలా ప్రమాదాలకు దారితీస్తాయని, జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు.