షణ్ముఖ్ జస్వంత్ కెరీర్ యూట్యూబ్‌లో మొదలైంది. ఆయనకు గుర్తింపు తెచ్చిన తొలి షార్ట్ ఫిల్మ్ 'వైవా' నుంచి 'సాఫ్ట్‌వేర్‌ డేవ్‌లవ్‌పర్' సిరీస్ వరకు... ఎన్నో ఫిల్మ్స్, సిరీస్‌లు చేశారు. అయితే... యూట్యూబ్ నుంచి టీవీకి వచ్చే అవకాశం 'బిగ్ బాస్' రియాలిటీ షో ద్వారా వచ్చింది. ఒకవేళ జీవితంలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే ఆ షోకి వెళ్లడం మానేస్తానని షణ్ముఖ్ జస్వంత్ అంటున్నారు. ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆ సంగతి చెప్పారు. ఎందుకో తెలుసా?

నా జీవితానికి షాక్ ఇచ్చి షేక్ చేసింది!
తన జీవితంలో వెనక్కి వెళ్లి ఏదైనా ఓ విషయాన్ని మార్చుకునే అవకాశం వస్తే ఆ షో (బిగ్ బాస్)కి వెళ్లడం మానేస్తానని షణ్ముఖ్ జస్వంత్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆ షో తనకు గుర్తింపు, పాపులారిటీని తెచ్చినప్పటికీ... అది తన జీవితాన్ని ఓ కుదుపు కుదిపిందని, పెద్ద షాక్ ఇవ్వడంతో పాటు జీవితాన్ని షేక్ చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. తన కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్ చూడటానికి ఆ షో ప్రధాన కారణమని చెప్పారు షన్ను.

'బిగ్ బాస్'కు వెళ్ళడానికి ముందు దీప్తి సునైనాతో షణ్ముఖ్ ప్రేమలో ఉన్నారు. ఆ షో నుంచి వచ్చిన తర్వాత బ్రేకప్ అయ్యింది. జీవితంలో పెద్ద షాక్ & షేక్ అంటే ఆ అంశం గురించి అయ్యి ఉండొచ్చని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్

'బిగ్ బాస్' షోలో షణ్ముఖ్ జస్వంత్ ప్రవర్తన, ఆయన వ్యవహార శైలి మీద వీక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో తనపై వచ్చిన విమర్శల పట్ల షన్ను స్పందిస్తూ... అప్పట్లో (2021లో) తనను విమర్శించిన వారు ఇప్పుడు తమ జీవితాల్లో ముందుకు వెళ్లిపోయి ఉండొచ్చు కానీ ఆ చేదు అనుభవాలు తనపై చాలా ప్రభావితం చూపించాయని చెప్పారు. ఆ షో తర్వాత తాను ఎంతో మానసిక వేదనను అనుభవించానని, చాలాసార్లు ఏడ్చానని కూడా ఆయన తెలిపారు.

Also Read: Shiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?

ఆ షో (బాగ్ బాస్) కారణంగా ఎదుర్కొన్న పరిస్థితులు, అప్పుడు వచ్చిన నెగిటివిటీ వంటివన్నీ తనను ఈ రోజు ఈస్థాయిలో నిలబెట్టాయని, వాటి వల్ల తాను ఒక వ్యక్తిగా ఎదిగి ప్రస్తుతం సినిమాలో హీరోగా చేసే వరకు రాగలిగానని షణ్ముఖ్ జస్వంత్ చెప్పారు. ఆ షో తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందన్నారు. ఇప్పుడు ప్రతి దానికి రియాక్ట్ అవ్వకుండా, రెస్పాండ్ అవ్వడం నేర్చుకున్నానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఇటీవల ఆయనకు నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అలాగే, ఈ ఏడాది హీరోగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Also Read: Polena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?