Shanmukh Jaswanth's Debut Movie Premaku Namaskaram Announced: షణ్ముఖ్ జశ్వంత్... పరిచయం అక్కర్లేని పేరు. కేవలం షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, కవర్ సాంగ్స్, సోషల్ మీడియా ద్వారానే హీరో రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. 'సూర్య', 'సాఫ్ట్‌వేర్ డెవలపర్', 'లీలా వినోదం' వంటి వెబ్ సిరీస్‌లతో యూత్‌లో అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక బిగ్ బాస్ సీజన్ 5లోనూ రన్నరప్‌గా నిలిచారు షన్నూ.

ఫస్ట్ టైం హీరోగా ఎంట్రీ

ఇప్పటివరకూ వెబ్ సిరీస్‌లతోనే ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసిన షన్నూ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. 'ప్రేమకు నమస్కారం' అనే డిఫరెంట్ లవ్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఆకట్టుకుంటోంది. 'AB సినిమాస్' బ్యానర్‌పై మూవీని నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా లవర్స్ ప్రాబ్లమ్

నోట్లో సిగరెట్... చేతిలో మందు బాటిల్‌తో ఓ బార్‌లోకి హీరో షన్నూ ఎంట్రీ ఇవ్వగా... అక్కడ ఒక్కొక్కరు ఒక్కో బ్రేకప్ స్టోరీతో బాధ పడుతుంటారు. తన చేతిలో ఉన్న బాటిల్‌ను పగలగొట్టిన షన్నూ... 'హలో సీనియర్స్... అందరూ ఇలా రండి. మీరంతా నాకు సీనియర్స్ నాకు ఓ గంట ముందే బ్రేకప్ అయ్యింది.' అంటూ చెప్పడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. బ్రేకప్ తర్వాత ఓ అబ్బాయి బాధతో తాగే మందు కోసం ఖర్చు చేసే డబ్బులతో కైలాసగిరి పక్కనే ల్యాండ్‌తో పాటు కారు కూడా తీసుకోవచ్చంటూ ఆ సీనియర్స్‌‌కు ఈ జూనియర్ హితోపదేశం చేస్తాడు.

'లవ్, బ్రేకప్ కారణంగా అందరూ దగ్గరుండి కెరీర్‌ను జాగ్రత్తగా నాశనం చేసుకుంటున్నారు' అన్న హీరో డైలాగ్‌తో లవ్, బ్రేకప్ దాని తర్వాత పరిణామాలు బ్యాక్ డ్రాప్‌గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. 'కొంత మంది అమ్మాయిలు అబ్బాయిలను వాడుకుని వదిలేస్తున్నారు. దేవదాస్ కాలం నుంచి ఇప్పటివరకూ తాగే బ్రాండ్స్ మారుతున్నాయ్. కానీ పద్ధతులు మారడం లేదు. ఇది పాన్ ఇండియా ప్రేమికుల ప్రాబ్లమ్. మోసం చేసే ప్రతి అమ్మాయికి బుద్ధి చెబుదాం. వాళ్లతోనే ప్రేమకు ఓ నమస్కారం అని చెబుదాం.' అంటూ చెప్పే ఫన్ ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది.

Also Read: ప్రశాంత్ నీల్ దేవుడన్న 'సలార్' మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ - 'వీర చంద్రహాస'తో డైరెక్టర్‌గా టాలీవుడ్ ఎంట్రీ

కొంతకాలంగా గ్యాప్

తెలుగులో అత్యధిక సబ్‌స్కైబర్స్ కలిగిన ఫస్ట్ యూట్యూబర్‌గా రికార్డ్ క్రియేట్ చేశారు షణ్ముఖ్. తన వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్‌తో ఎంత పాపులర్ అయ్యారో... వ్యక్తిగత జీవితంలో వివాదాలతోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బిగ్ బాస్ సీజన్ 5 టైంలో లవ్, బ్రేకప్ వార్తలు హల్చల్ చేశాయి. బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ దీప్తితో ప్రేమాయణం సాగించారు. ఆ తర్వాత వీరిద్దరికీ బ్రేకప్ అయ్యింది. దీనికి సిరి కారణమంటూ ట్రోలింగ్స్ కూడా సాగగా... దానిపై ఓ ఇంటర్వ్యూలో షన్నూ క్లారిటీ ఇచ్చారు. దీని తర్వాత గంజాయి తీసుకోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో దొరకడం వంటి ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు.

రీసెంట్‌‌గా 'ఏజెెంట్', 'లీలా వినోదం' అనే వెబ్ సిరీస్‌లతో మెప్పించారు. ఆ తర్వాత కొంతకాలం అటు సోషల్ మీడియా, ఇటు వెబ్ సిరీస్‌లకు దూరంగా మూవీ కెరీర్‌పై దృష్టి సారించారు. తాజాగా షణ్ముఖ్ హీరోగా ఫస్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.