September 9 number mystery: 'డబుల్ 9 శక్తి'తో నిండిన సెప్టెంబర్ 2025 ! ఈ నెలలో శుభ అశుభ ప్రభావాలు ఇవే!

3 months ago 3
ARTICLE AD

September 2025 Mystery:  సంఖ్యా శాస్త్రంలో సెప్టెంబర్ నెల చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది సంవత్సరంలో 9వ నెల ... దాని అంకెలను కలిపినప్పుడు (S+E+P+T+E+M+B+E+R=9) కూడా 9 వస్తుంది.

9 సంఖ్య.. గ్రహానికి ప్రతినిధి దీనికి అధిపతి మంగళుడు (Mars). మంగళ గ్రహం శక్తి, ధైర్యం, కోపం, అభిరుచికి కారకం. 9 అంకె యొక్క స్వభావం గురించి చెప్పుకుంటే ఇది కర్మ, కృషి, ధైర్యం మార్పునకు చిహ్నం.

సెప్టెంబర్ నెల మొత్తం కూడినా 9

సెప్టెంబర్ (9) , 2025 (2+0+2+5=9) మొత్తం కూడినా కూడా 9 అవుతుంది. అంటే సెప్టెంబర్ నెలలో ఒకటి కాదు, రెండు 9 ల శక్తి ఉంది.

సెప్టెంబర్ నెలలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం , పితృ పక్షం అన్నీ ప్రారంభమవుతున్నాయి. ఈ సమయంలో కొన్ని పనులు చేయకూడదు.

9 నంబర్ మంగళ గ్రహానికి చెందినది

సంఖ్యా శాస్త్రంలో తొమ్మిది అంకెకు అధిపతి మంగళ గ్రహం. దీని ప్రస్తావన బృహత్ సంహిత (వరాహమిహిరుడు)లో కూడా చూడవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మంగళుడు భూమి, ధైర్యం , రక్తానికి చిహ్నం

సంఖ్యా శాస్త్రంలో 9 అంకె పరిపూర్ణమైనది.  గవత పురాణం  గీతలో కూడా తొమ్మిది అంకెకు ప్రత్యేక స్థానం ఉంది. భాగవత పురాణం  స్కంధం 11, అధ్యాయం 20, శ్లోకం 9 లో ధర్మంలో 9 భాగాలు - శ్రవణం, కీర్తన, స్మరణ, పదసేవనం, అర్చన, వందనం, దాస్య, సఖ్య, ఆత్మనివేదన అని ఉంది

సెప్టెంబర్ నెలలో ఏం చేయకూడదు?

ఈ నెలలో ఎవరితోనూ గొడవ పడకండి. ఎవరైనా చెడు పనులకు ప్రేరేపిస్తే, ప్రశాంతంగా ఆ ప్రదేశానికి దూరంగా ఉండండి.

సెప్టెంబర్ నెలలో వాహనం నడుపుతున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాన్ని ఎక్కువ వేగంతో నడపవద్దు , అత్యవసరం అయినప్పుడు మాత్రమే వాహనాన్ని తీయండి.

ఈ నెలలో మీ పనిలో నిర్లక్ష్యం చేయవద్దు. ఆఫీసుకు వెళ్లేవారు కార్యాలయంలో సమయాన్ని గమనించాలి. అదే సమయంలో, ఇంటి నుంచి పని చేసేవారు కూడా తమ పనిని సకాలంలో పూర్తి చేయాలి.

సెప్టెంబర్ నెలలో రెండు గ్రహణాలు ఉన్నాయి, ఇవి ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరి జీవితంపై ప్రభావం చూపుతాయి.

సెప్టెంబర్ నెలలో ఏం చేయడం శుభం?

ఈ నెలలో ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుంది. దాన ధర్మాలు చేయండి, పుణ్య కార్యాలు ఆచరించండి. సేవకు సంబంధించిన పనులలో నిస్వార్థంగా సమయం కేటాయించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వీటిని అనుసరించడం ద్వారా 9 సంఖ్య ప్రతికూల ప్రభావం మీపై తగ్గుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు

సెప్టెంబర్ నెల అనేక కారణాల వల్ల శక్తివంతమైనది. ఈ నెలలో మీరు ఎలా ప్రవర్తిస్తారో..భవిష్యత్ లోనూ అవే ఫలితాలు పొందుతారు. అందుకే  సెప్టెంబర్ నెలలో మిమ్మల్ని మీరు సత్కర్మ, ఆధ్యాత్మికత , సేవా భావనతో అనుసంధానించుకోండి, ఏదైనా పనిలో తొందరపడటం లేదా కోపగించుకోవడం మానుకోండి.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.

సెప్టెంబరు 7న సంపూర్ణ చంద్ర గ్రహణం! గ్రహణం సమయం, సూతకాలం, ఏ రాశివారు గ్రహణం చూడకూడదు? పూర్తి వివరాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Read Entire Article